ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాతకు ఇంతమంది పిల్లలా? అని అనుమానిస్తూ అందరికీ డీఎన్ఏ టెస్టు చేయించింది... తన రిపోర్టు చూసుకుని గుడ్లు తేలేసింది!

ABN, First Publish Date - 2021-10-04T17:24:08+05:30

ఒక్కోసారి వేళాకోళం విపరీత పరిణామాలకు దారితీస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్కోసారి వేళాకోళం విపరీత పరిణామాలకు దారితీస్తుంది. ఫ్రెండ్స్ మధ్య జరిగే వేళాకోళాలు శృతిమించినపుడు అనర్థాలు చోటుచేసుకున్న ఘటనలు మనం ఎప్పుడో ఒకప్పుడు వినేవుంటాం. 31 ఏళ్ల అమండా స్టాక్సీ విషయంలో అలానే జరిగింది. ఆమె తమ కుటుంబ సభ్యుల డిఎస్ఏ రిపోర్టులో ఏమి రిజల్ట్ వస్తుందో తెలుసుకుందామనుకుంది. అనున్నదే తడవు డిఎన్ఏ టెస్టుకు శాంపిల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన రిపోర్టును చూడగానే ఆమె నిర్ఘాంతపోయింది. ఇంతకాలం తల్లిదండ్రులు‌గా భావిస్తున్నవారు తన పేరెంట్స్ కాదనే వాస్తవం తెలియగానే ఆమెకు పాదాల కింద భూమి కదిలిపోయినట్లు అనిపించింది. 


@stacysinterlude7 పేరుతో ఉన్నటిక్ టాక్ అకౌంట్‌లో అమండా తన డిఎన్ఏ రిపోర్టు అనుభవాన్ని వెల్లడించింది. ఆమె తాతకు అధిక సంతానం ఉన్నారు. వీరిలో వేరే కుంటుంబానికి చెందినవారు ఎవరైనా ఉంటారేమోననే చిలిపి ఆలోచనతో అమండా అందరికీ డిఎన్ఎ టెస్టులు చేయించింది. అందిరి డీఎన్ఏ టెస్టులు మ్యాచ్ అయినప్పటికీ, ఒక రిపోర్టు మాత్రం మ్యాచ్ కాలేదు. అది ఎవరిదా అని చూస్తే... అది తనదే(అమండా)నని స్పష్టమయ్యింది. దీంతో ఆమెకు రెండు నిముషాల పాటు ఊపిరి ఆగిపోయినంతపనయ్యింది. ఈ సందర్భంగా అమండా మాట్లాడుతూ ఇంట్లోని అందరి డిఎన్ఏ టెస్టులు మ్యాచ్ కాగా ఒకరిది మాత్రం 50 శాతమే మ్యాచ్ అయ్యింది. అది తనదేనని తెలుసుకున్నాక తల్లిదండ్రులను ఈ విషయమై అడగగా, వారు సమాధానం చెప్పేందుకు నిరాకరించారని తెలిపింది. అయితే ఇది జరిగిన రెండు రోజుల తరువాత తల్లిదండ్రులు ఆమెకు నిజం చెప్పారు. 


ఆమె వారి కుమార్తె కాదని తెలిపారు. ఈ విషయాన్ని అమండా ఒకపట్టాన నమ్మలేకపోయింది. అదేరోజు ఆమె తన బయోలాజికల్ తండ్రి గురించి తెలుసుకుంది. రెండు వారాల తరువాత ఆమె తన అసలైన తల్లిదండ్రులను కలుసుకుంది. అమండాను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు... తమ పోలికలతో కలసిన జంటకు చెందిన పిల్లలను దత్తత తీసుకోవాలనుకున్నారు. అప్పుడు దత్తత తీసుకున్న బిడ్డ తమ సంతానమే అనిపించేలా ఉంటుందని భావించారు. ఈ ఆలోచన మేరకే అమండాను దత్తత తీసుకున్నారు. దీంతో బయటివారంతా కూడా అమండా వారి కుమార్తేనని అనుకున్నారు. అమండా కూడా అలానే భావించింది. దీంతో ఇంతకాలం ఈ విషయం బయటపడలేదు. పైగా అమండాకు ఆ ఇంటిలోని కుటుంబ సభ్యులందని ప్రేమ, అభిమానాలు లభించాయి.

Updated Date - 2021-10-04T17:24:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising