ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటిలోని టీవీ బాక్సు చుట్టూ కుక్క చక్కర్లు.. అనుమానంతో బాక్సు తెరిచిన మహిళ.. వెంటనే టీవీ షోరూంనకు పరిగెత్తుకుంటూ వెళ్లి..

ABN, First Publish Date - 2021-10-31T13:46:04+05:30

బాక్సులో ఇంటికొచ్చిన కొత్త సామానును..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాక్సులో ఇంటికొచ్చిన కొత్త సామానును చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి? ఇంటికి కొత్తవస్తువుకు సంబంధించిన ప్యాకింగ్ ఏదైనా వస్తే వెంటనే ఓపెన్ చేసి చూడాలనిపిస్తుంది. అయితే ఇదే ధోరణిలో ఉన్న ఒక మహిళకు చేదు అనుభవం ఎదురయ్యింది. వివరాల్లోకి వెళితే ఇంగ్లండ్‌లోని సోమర్‌సెట్ నివాసి డెబ్రా కాన్గ్రమ్(41) సెప్టెంబరులో ఒక కంపెనీకి చెందిన టీవీని రూ. 28 వేలకు కొనుగోలు చేసింది. ఆ తరువాత ఆమెకు చేదు అనుభం ఎదురయ్యింది. 


దీని గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను ప్రముఖ టీవీ కంపెనీ షోరూమ్ నుంచి టీవీని కొనుగోలు చేశానని, దానిని తన కుమార్తెకు గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నానని తెలిపారు. దీంతో ఇంటికి వచ్చిన టీవీ బాక్సును తెరవకుండానే ఉంచానన్నారు. దానిని క్రిస్మస్ కానుకగా తన కుమార్తెకు ఇవ్వాలనుకున్నానని తెలిపారు. అయితే తమ పెంపుడు కుక్క ఆ బాక్స్ చుట్టూ తిరుగుతుండటంతో తమకు అనుమానం వచ్చి, ఆ బాక్సు తెరవాలనుకున్నామన్నారు. దానిని తెరవగానే లోపలి నుంచి తీవ్రమైన దుర్వాసన వచ్చిందని డెబ్రా తెలిపారు. బాక్సులో టీవీ పక్కన ఒక ప్యాకెట్ ఉందని, దాని తెరిచి చూడగానే తమకు ప్రాణాలు పోయినంత పనయ్యిందన్నారు. దానిలో ఉన్న మాంసపు ముక్కలను చూసి ఆశ్చర్యపోయామన్నారు. ఆ దుర్వాసనకు తమకు కడుపులో తిప్పడంతో పాటు వాంతి కూడా వచ్చిందన్నారు. కాగా ఈ విషయాన్ని ఆమె ఆ టీవీ షోరూం నిర్వాహకులకు తెలియజేశారు. అయితే వారు తమకు ఆ బాక్సులోకి మాంసం ముక్కలు ఎలా వచ్చాయో తెలియవని చెప్పారు. దీంతో ఆమె ఆ టీవీకి బదులు మరో టీవీ కావాలని డిమాండ్ చేశారు. దానికి వారు సమ్మతి తెలుపుతూ, రూ. 3 వేల తగ్గింపుతో మరో టీవీని డెబ్రాకు అందించారు.

Updated Date - 2021-10-31T13:46:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising