ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అబద్ధం చెప్పి మరో అమ్మాయితో జల్సా చేస్తున్న తన బాయ్‌ఫ్రెండ్‌ని టెక్నాలజీ సహాయం పట్టుకున్న యువతి.. అది ఎలాగంటే..

ABN, First Publish Date - 2021-10-07T10:29:20+05:30

మీరు ప్రేమిస్తున్న వారు మీపట్ల నిజాయితీగా లేదనిపిస్తే మీరు నిజం తెలుసుకోవడానికి ఏం చేయగలరు. చాలా మంది ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు. మరికొంత మంది తమకు కావల్సిన వాళ్లు ఇలా చేస్తారని అనుమానం వస్తే ముందుగా ఆ వ్యక్తి ఫోన్ చెక్ చేస్తారు. అతని మెసేజెస్, సోషల్ మీడియాను చెక్ చేస్తారు. కానీ ఓ యువతి అయితే ఎంతో సాహసం చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీరు ప్రేమిస్తున్న వారు మీపట్ల నిజాయితీగా లేదనిపిస్తే మీరు నిజం తెలుసుకోవడానికి ఏం చేయగలరు. చాలా మంది ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు. ఎందుకంటే అవతలి వ్యక్తి ఏమంనుకుంటారోనని భయం.


మరికొంత మంది తమకు కావల్సిన వాళ్లు ఇలా చేస్తారని అనుమానం వస్తే ముందుగా ఆ వ్యక్తి ఫోన్ చెక్ చేస్తారు. అతని మెసేజెస్, సోషల్ మీడియాను చెక్ చేస్తారు. కానీ ఓ యువతి అయితే ఎంతో సాహసం చేసింది. తన ప్రియుడిపై అనుమానంతో ఎవరూ అనుకోని విధంగా లేడి డిక్టెటివ్ అవతారం ఎత్తింది. అతనెక్కడున్నాడో తెలుసుకోవడానికి టెక్నాలజీని తెలివిగా వాడింది. ఈ విషయాన్ని తన ఫ్రెండ్‌కి వివరిస్తూ తీసిన వీడియో ఇప్పుడు టిక్‌టోక్‌లో యమ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఆ వీడియోకి దాదాపు ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయి.


స్టెఫ్‌కి ఒక బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అతడు మరో అమ్మాయితో తిరుగుతూ తనకు చీట్ చేస్తున్నాడని ఆమెకు అనిపించింది. ఆమె తన అనుమానాన్ని తీర్చుకునేందుకు ఇస్స్‌టాగ్రామ్‌లోని లొకేషన్ టూల్‌ని ఉపయోగించింది. తన బాయ్‌ఫ్రెండ్ పోస్ట్ చేసే ఫోటోల లొకేషన్లను స్టెఫ్‌ పరిశీలించింది. అలా ఫొటోలను పరిశీలిస్తూ, ఆ ఫొటోలు ట్యాగ్ చేసిన ప్రతి అమ్మాయిల కోసం వెతికింది.


ఒక్కసారి అందులో ట్యాగ్ చేసిన అమ్మాయిల అడ్రస్ తెలుసుకొని వారు తమ గురించి చెప్పే స్టోరీస్‌ను స్టెఫ్‌ స్క్రీన్ రికార్డ్ చేసింది. అలా రికార్డ్ చేసిన వాటిని మళ్లీ బాగా పరిశీలించగా తన బాయ్‌ఫ్రెండ్ ఎవరితో ఉన్నాడో వారి మాటలను బట్టి పసిగట్టింది.


ఇలా కూడా ఒక చీటర్ బాయ్‌ఫ్రెండ్ పట్టుకోవచ్చా అని నెటిజన్లు స్టెఫ్‌ను పొగుడుతున్నారు. స్టెఫ్‌ ఒక జీనియస్ అని ఒక యూజర్ అన్నాడు. కానీ ఆమె బాయ్‌ఫ్రెండ్ మాత్రం స్టెఫ్‌ ఒక సైకో అని తను ఇంతలా అన్వేషిస్తుందని ఊహించలేకపోయానని చెబుతున్నాడు.




Updated Date - 2021-10-07T10:29:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising