ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

19 ఏళ్ల యువతి.. దగ్గు వస్తోందని హాస్పిటల్‌కు వెళితే.. షాకింగ్ విషయం బయటపెట్టిన డాక్టర్లు!

ABN, First Publish Date - 2021-07-22T16:28:12+05:30

అమెరికాలోని చికాగోకు చెందిన క్లెయిర్ మాక్ రెండు నెలలుగా తీవ్ర దగ్గుతో బాధపడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికాలోని చికాగోకు చెందిన క్లెయిర్ మాక్ రెండు నెలలుగా తీవ్ర దగ్గుతో బాధపడుతోంది. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గకపోవడంతో ఇటీవల హాస్పిటల్‌కు వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు చికిత్సలో భాగంగా ఎక్స్ రే తీయించాడు. ఆ ఎక్స్ రే ద్వారా ఓ షాకింగ్ విషయం బయటపడింది. క్లెయిర్ గుండె శరీరంలో ఎడమ వైపున కాకుండా కుడి వైపున ఉన్నట్టు డాక్టర్ గుర్తించాడు. ఆ విషయం తెలుసుకుని క్లెయిర్ షాకైంది. 


శరీరంలో కుడివైపు గుండె ఉన్నా 19 ఏళ్ల పాటు ఆమెకు ఆ విషయమే తెలియలేదు. సాధారణ ఆరోగ్యవంతురాలిగానే అన్ని రోజులూ గడిపేసింది. గుండె ఇలా కుడి వైపు ఉండడాన్ని `డెక్స్‌ట్రాకార్డియా` అంటారు. ప్రపంచ జనాభా మొత్తంలో కేవలం ఒక శాతం మంది మాత్రమే ఇలా కుడివైపు గుండెతో పుడతారని వైద్యులు చెబుతున్నారు. క్లెయిర్‌కు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తప్ప ప్రస్తుతం ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని వైద్యులు చెప్పారు. 


కాగా, తన గుండె కుడివైపు ఉందనే షాకింగ్ విషయం తెలుసుకున్న క్లెయిర్ దానిని సోషల్ మీడియా ద్వారా ఇతరులతో పంచుకుంది. తన కథను టిక్‌టాక్ వీడియో ద్వారా తెలియజేసింది. ఈ వీడియో ఇప్పటికి 30 లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది.  


Updated Date - 2021-07-22T16:28:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising