ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guinness: అలా కూర్చుని... ఇలా వరల్డ్ రికార్డ్

ABN, First Publish Date - 2021-09-18T22:13:49+05:30

ఆస్ట్రియాకు చెందిన ఒక మహిళ ఎల్ ఆకారంలో ఐదు నిమిషాలకు పైగా కూర్చొని గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఆస్ట్రియాకు చెందిన అథ్లెట్ స్టెఫానీ మిలింజర్ (29) ఎల్ ఆకారంలో 5 నిమిషాల 15 సెకండ్ల‌కు పైగా కూర్చుని వరల్డ్ రికార్డు సాధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వియన్నా: ఆస్ట్రియాకు చెందిన ఒక మహిళ ఎల్ ఆకారంలో ఐదు నిమిషాలకు పైగా కూర్చొని గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఆస్ట్రియాకు చెందిన అథ్లెట్ స్టెఫానీ మిలింజర్ (29) ఎల్ ఆకారంలో 5 నిమిషాల 15 సెకండ్ల‌కు పైగా కూర్చుని వరల్డ్ రికార్డు సాధించింది. ఆమె పేరిట గత 10 సంవత్సరాల కాలంలో ఆరు వరల్డ్ రికార్డులు నమోదయ్యాయి. అతి కష్టమైన విన్యాసాలను తన సోషల్‌మీడియా ఖాతాలో ఆమె పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. ఈ ఖాతాను అనుసరించేవారి సంఖ్య దాదాపుగా 5 లక్షలకు పైగా ఉంటుంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో గిన్నిస్ వరల్డ్ రికార్డుకు సంబంధించిన వీడియాను ఆమె పోస్ట్ చేసింది. ఎల్ ఆకారంలో కూర్చున్నప్పుడు మొత్తం శరీరం బరువు చేతులపైనే పడుతుంటుంది. మిలింజర్ పోస్ట్ చేసిన వీడియోతో అభిమానులు విస్మయం చెందారు. ఆమె చూపిన  ప్రతిభకు కామెంట్స్ సెక్షన్‌లో ప్రశంసలు వెలువెత్తాయి. దాదాపుగా 12లక్షల మంది ఈ వీడియోను వీక్షిస్తే లక్ష మందికి పైగా దీనిని లైక్ చేశారు. ఈ రికార్డు సాధించడానికి ఎంతో కృషి చేశానని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరిస్‌లో ఆమె తెలిపింది. ప్రాక్టీస్ మొదలు పెట్టిన నాటి నుంచి ఒక్క రోజు కూడా జిమ్‌కు వెళ్ళడం మానలేదని చెప్పింది.

Updated Date - 2021-09-18T22:13:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising