ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోమాలో కరోనా పేషెంట్.. పక్కనే కూర్చున్న భార్య.. ఆమె మాటలు విని..

ABN, First Publish Date - 2021-01-09T06:30:15+05:30

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా గజగజలాడిస్తుందో తెలిసిందే. దీని ధాటికి అగ్రరాజ్యం అమెరికా కూడా అల్లాడుతోంది. ఇలాంటి క్రమంలో కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తి తన కథను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా గజగజలాడిస్తుందో తెలిసిందే. దీని ధాటికి అగ్రరాజ్యం అమెరికా కూడా అల్లాడుతోంది. ఇలాంటి క్రమంలో కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తి తన కథను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే తను కోలుకోవడానికి భార్యే కారణమని అతను చెప్పడమే. భార్యాభర్తల మధ్య ప్రేమ నిజంగా మనుషుల్ని బ్రతికిస్తుందని, దానికి తన కథే నిదర్శనమని చెప్తున్న డాన్ గిల్‌మర్ కథేంటో చూద్దామా?


అమెరికాలోని సౌత్ కరోలినాలో 43 ఏళ్ల గిల్‌మర్, అతని భార్య నివశిస్తున్నారు. జూలై నెలలో గిల్‌మర్‌కు కరోనా సోకింది. కొంత కాలం హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. అయితే ఆ తర్వాత విపరీతమైన దగ్గు మొదలైంది. దీంతో నిద్ర పోవడం కూడా కష్టం అయిపోయింది. దీంతో అవసరమైన వస్తువులు తీసుకొని బాన్ సెకార్స్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆస్పత్రిలో చేరిపోయాడు. అక్కడ ఉండగా అతని ఆస్పత్రి బిల్లులు కట్టడం కోసం సోషల్ మీడియాలో విరాళాలు సేకరించారు. ఇలా ట్రీట్‌మెంట్ జరుగుతున్న సమయంలో గిల్‌మర్‌కు విపరీతంగా జ్వరం వచ్చింది. 



ఫీవర్ 104 చూపించడంతో డాక్టర్లు ఆందోళన చెందారు. గిల్‌మర్‌ను వైద్య విధానంలో కోమాలోకి పంపడం తప్ప వేరే మార్గం లేదని, లేదంటా అతను ప్రాణాలకు చాలా ముప్పు ఉంటుందని తేల్చారు. ఆరోజు రాత్రి ట్రీట్‌మెంట్‌కు గిల్‌మర్ శరీరం ఎలా రెస్సాండ్ అవుతుందో చూస్తేగానీ అతని పరిస్థితి ఏంటనేది చెప్పలేని పరిస్థితి. అలాంటి సమయంలో గిల్‌మర్ భార్య.. అతని పక్కనే కూర్చొని ‘‘నీకేం కాదు. నిన్ను డాక్టర్లు చాలా బాగా చూసుకుంటున్నారు. నువ్వు త్వరగా కోలుకుంటావు’’ అంటూ ధైర్యం చెప్పింది. ఆ తర్వాత కరోనా నుంచి కోలుకున్న గిల్‌మర్.. ఆ రాత్రి తన భార్య చెప్పిన మాటలు తనకు వినిపించాయని బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు.


‘‘నిజంగా చెప్తున్నా.. ఆరోజు ఆమె మాట్లాడిన మాటలు నాకు వినిపించాయి. ఆమె నా దేవత. నేను కోలుకొని ఇప్పుడు మీ ముందు ఉన్నానంటే దానికి తనే కారణం’’ అంటూ తన భార్యకు ధన్యవాదాలు చెప్తున్నాడు గిల్‌మర్. ‘‘ఈ రాత్రి గడిస్తేగానీ ఏం చెప్పలేమని డాక్టర్లు అన్న రోజు.. తను ఎలా గడిపిందో నాకు తెలీదు. కానీ నేనైతే అంత ధైర్యంగా ఉండగలననే నమ్మకం నాకు లేదు. అందుకే తను నా దేవత’’ అని గిల్‌మర్ అంటున్నాడు. కాగా, అగ్రరాజ్యంలో ఇప్పటికే కరోనా బారిన పడి 3,63,000 మందికి పైగా మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-01-09T06:30:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising