ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొమ్మిదో అంతస్తు నుంచి దూకిన భార్య.. పరుగెత్తుకొచ్చి ఆమె చేయి పట్టుకున్న భర్త.. ఆ తర్వాత..

ABN, First Publish Date - 2021-07-15T22:22:56+05:30

భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ పెద్ద హైడ్రామాకు దారి తీసింది. 9వ అంతస్తు నుంచి కిందకు దూకిన ఆమెను భర్త గట్టిగా పట్టుకొని కాపాడటానికి ప్రయత్నించాడు. ఇదంతా చూసిన స్థానికులు టెన్షన్‌తో వణికిపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ పెద్ద హైడ్రామాకు దారి తీసింది. 9వ అంతస్తు నుంచి కిందకు దూకిన ఆమెను భర్త గట్టిగా పట్టుకొని కాపాడటానికి ప్రయత్నించాడు. ఇదంతా చూసిన స్థానికులు టెన్షన్‌తో వణికిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వెలుగు చూసింది. ఇక్కడ విజయనగర్‌ ప్రాంతంలోని సేవియర్ సొసైటీలో ఫరాజ్ హసన్, సాదియా దంపతులు నివశిస్తున్నారు. వీళ్లిద్దరు ఇక్కడ 9వ అంతస్తులోని ప్లాటులో ఉంటున్నారు. మంగళవారం నాడు వీళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ చిలికిచిలికి గాలివానలా పెద్ద గొడవకు దారితీసింది. దీంతో కోపంతో ఊగిపోయిన సాదియా.. వేగంగా పరిగెత్తి బాల్కనీ తలుపు తీసి అక్కడి నుంచి కిందకు దూకేసింది. అయితే ఆమె వెనుకే వేగంగా వచ్చిన ఫరాజ్.. వెంటనే స్పందించి సాదియా చెయ్యి పట్టుకున్నాడు. దీంతో ఆమె కింద పడకుండా ఆగింది. 



భార్య చెయ్యి పట్టుకొని ఆమె కింద పడకుండా కాపాడిన ఫరాజ్.. పెద్దగా కేకలు వేసి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశాడు. ఇది చూసిన సొసైటీలోని స్థానికులు వెంటనే తమ ఇళ్లలోని పరుపులు, దుప్పట్లు తీసుకొచ్చి ఆ బిల్డింగ్ కింద పరిచారు. ఇలా కనీసం మూడు నిమిషాల పాటు భార్యను పట్టుకొని ఉన్న ఫరాజ్.. ఆ తర్వాత చెయ్యి జారడంతో ఆమెను వదిలేశాడు. దీంతో 9వ అంతస్తు నుంచి సాదియా కింద పడిపోయింది. పరుపులపై పడినప్పటికీ ఆమెకు తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో ఆమెను నోయిడాలోని ఒక ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఈ ఘటన మొత్తాన్ని సొసైటీలోని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో బుధవారం వైరల్ అవడంతో విషయం పోలీసుల వరకూ వెళ్లింది. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2021-07-15T22:22:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising