ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Post: మర్చిపోకుండా అన్నీ తీసుకురండంటూ భర్తకు ఓ భార్య ఇచ్చిన సరుకుల లిస్ట్‌ను చూస్తే...

ABN, First Publish Date - 2021-08-27T16:51:11+05:30

ఇంటి సామాన్ల షాపింగ్‌కు వెళ్లిన భర్త నిముషానికోసారి ఫోన్ చేసి ‘ఇది తీసుకురావాలా? లేక అది తెచ్చేనా?’ అని భార్యలకు ఫోన్లు చేయడం మనకు తెలుసు. కొంతమంది అలా ఫోన్లు కూడా చేయకుండా తప్పుడు వస్తువులో లేదంటే కొన్ని వస్తువులు అసలు మర్చిపోయి ఇంటికి తిరిగి రావడం కూడా పరిపాటే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఇంటి సామాన్ల షాపింగ్‌కు వెళ్లిన భర్త నిముషానికోసారి ఫోన్ చేసి ‘ఇది తీసుకురావాలా? లేక అది తెచ్చేనా?’ అని భార్యలకు ఫోన్లు చేయడం మనకు తెలుసు. కొంతమంది అలా ఫోన్లు కూడా చేయకుండా తప్పుడు వస్తువులో లేదంటే కొన్ని వస్తువులు అసలు మర్చిపోయి ఇంటికి తిరిగి రావడం కూడా పరిపాటే. ఇలాంటి సంఘటనలు తనకు జరగకూడదని అనుకున్న ఆ భార్య మాత్రం బాగా ఆలోచించి ఒక బ్రిలియంట్ ప్లాన్ వేసింది. భర్తకు ఒక లిస్టు రాసిచ్చింది. ‘‘ఆ.. ఇలా మేం కూడా చాలా సార్లు చేశాం’’ అని కొట్టిపారేయకండి. ఆమె ఇచ్చినంత డీటెయిల్డ్‌గా మాత్రం కూరగాయల లిస్టు ఎవరూ ప్రిపేర్ చేసుండరు. ఇంటికి కావలసిన వస్తువులన్నిటి పేర్లు రాయడంతోపాటు, ఆ వస్తువుల ఫొటోలు తీసుకొచ్చి అతికించింది.


మెలిండా అనే టిక్‌టాక్ యూజర్ తాను ప్రిపేర్ చేసిన ఈ లిస్టు వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. దీనిలో ఆమె ప్రతి వస్తువు ధర, ఎంత కావాలి? వంటి వివరాలతోపాటు. సూపర్ మార్కెట్లో ఏ సెక్షన్‌లో ఎటువైపు ఆ వస్తువులు దొరుకుతాయనే విషయాన్ని కూడా బొమ్మలుగా గీసింది. ఆ వీడియో చివర్లో ఇది సరదా కోసం చేసిన పనేనని ఆమె చెప్పింది. నెటిజన్లు కూడా దీనిపై మంచి జోకులు పేలుస్తున్నారు. కొందరు ఆమెది నిజంగా అద్భుతమైన ప్లాన్ అని మెచ్చుకుంటుంటే.. కొందరేమో ఇంత చేసినా సరే ఆమె భర్త మాత్రం సూపర్ మార్కెట్‌కు వెళ్లి ఫోన్లు చేయకమానడని అంటున్నారు. మరికొందరు ఆమె భర్తను ఉద్దేశించి, ‘అయినా సరే అతను ఒకదాని బదులు మరో వస్తువు కొని తెస్తాడు చూడు’ అంటూ సరదా కామెంట్లు చేశారు. ఇలా గతంలో కూడా కొన్ని కూరగాయల చీటీలు నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Updated Date - 2021-08-27T16:51:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising