ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

31 ఏళ్ల క్రితం పెళ్లి.. నలుగురు కూతుళ్లు, ఓ కొడుకు.. స్కూల్లో టీచర్‌గా పనిచేసే ఆమెకు ఈ వయసులో ఇలాంటి కష్టం ఏంటి..?

ABN, First Publish Date - 2021-11-23T15:57:17+05:30

ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌లో ఒక ఉపాధ్యాయురాలికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌లో ఒక ఉపాధ్యాయురాలికి ట్రిపుల్ తలాక్ ఇచ్చిన ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి తన భార్య జీతం తెచ్చి తనకు ఇవ్వలేదని ఆమెకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. దీనిపై బాధితురాలు ఎస్పీ అనురాగ్ ఆర్యాకు ఫిర్యాదు చేసింది. తన భర్త మరో వివాహం చేసుకున్నాడని ఫిర్యాదులో ఆరోపించింది. బాధితురాలికి 1990లో నిఖా జరిగింది. 


ఆ దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. బాధితురాలికి హాజీపూర్ గోథనా ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్‌తో వివాహమయ్యింది. అలాగే ఆమె ఒక మదరసాలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. తనకు వచ్చే కొద్దిపాటి జీతంతోనే ఆమె కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే ఆమె భర్త ఈమధ్య ఆమెకు వచ్చే జీతాన్ని అడిగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఆగ్రహంతో ఇర్ఫాన్ ఆమెపై దాడి చేశాడు. ఈ నేపధ్యంతో ఆమె వైద్యచికిత్స తీసుకుంటోంది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కొద్ది రోజుల క్రితం అత్తామామలు తనను రూ. 5 లక్షల తీసుకురమ్మని డిమాండ్ చేస్తున్నారని, తాను అంతమొత్తం తీసుకురాలేకపోవడంతో తనకు భర్త ట్రిపుల్ తలాక్ ఇచ్చాడని తెలిపింది. తరువాత తనను కొట్టి ఇంటి నుంచి తరిమేశారని పేర్కొంది. ఈ ఉదంతంపై ఎస్పీ అనురాగ్ ఆర్య మాట్లాడుతూ బాధితురాలి ఫిర్యాదు తమకు అందిందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2021-11-23T15:57:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising