స్మార్ట్‌ఫోన్ కోసం భార్య గొడవ.. ఆ భర్త చేసిన ఒక్క మిస్టేక్‌తో 13 నెలల బాలికకు కొండంత కష్టం..!
ABN, First Publish Date - 2021-07-06T16:36:45+05:30
స్మార్ట్ ఫోన్ కోసం మొదలైన చిన్న గొడవ ఆ కుటుంబంలో విషాదం నింపింది.
స్మార్ట్ ఫోన్ కోసం మొదలైన చిన్న గొడవ ఆ కుటుంబంలో విషాదం నింపింది. తల్లి, తండ్రి ఆత్మహత్యలు చేసుకుని చనిపోగా అభం శుభం తెలియని 13 నెలల బాలిక అనాథ అయిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికులను కలిచివేస్తోంది. ఆగ్రాకు సమీపంలోని జగదీష్‌పురాకు చెందిన ఆకాష్ కొటక్ మహీంద్రా బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 2018లో ఆర్తి సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. ఆర్తి కాల్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తోంది. వీరికి 13 నెలల వయసున్న కూతురు ఉంది.
ఐదు రోజుల క్రితం ఆర్తి తన మొబైల్‌ను పోగొట్టుకుంది. దీంతో తనకు వెంటనే కొత్త మొబైల్ కొనమని భర్తని అడిగింది. అందుకు భర్త నిరాకరించాడు. కొద్ది రోజులు ఆగి కొంటానని చెప్పాడు. గత ఆదివారం మొబైల్ గురించి వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆకాష్ బెడ్రూమ్‌లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. భర్త చనిపోయాడని తెలుసుకున్న ఆర్తి తన చేతిని కోసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు చూసేసరికే వీరిద్దరూ చనిపోయారు. అనాలోచితంగా ఆవేశంలో వారు చేసిన పనికి 13 నెలల బాలిక అనాథగా మిగిలిపోయింది.
Updated Date - 2021-07-06T16:36:45+05:30 IST