ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాలిబన్లు అధికారంలోకి రాగానే ప్రజలు ఎందుకు పారిపోతున్నారు?.. అంత భయపెట్టే చట్టాలేంటి?

ABN, First Publish Date - 2021-08-20T16:29:57+05:30

అమెరికా సైన్యం అఫ్ఘాన్ గడ్డ మీద నుంచి అలా వెనుతిరిగింది. ఇంకా పూర్తిగా అడుగు బయటకు వేయకముందే అఫ్ఘానిస్థాన్‌కు దిమ్మతిరిగిపోయేలా తాలిబన్లు దూకుడు ప్రదర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా సైన్యం అఫ్ఘాన్ గడ్డ మీద నుంచి అలా వెనుతిరిగింది. ఇంకా పూర్తిగా అడుగు బయటకు వేయకముందే అఫ్ఘానిస్థాన్‌కు దిమ్మతిరిగిపోయేలా తాలిబన్లు దూకుడు ప్రదర్శించారు. ఒకటొకటిగా ముఖ్యమైన పట్టణాలన్నింటినీ తాలిబన్లు ఆక్రమించేసుకున్నారు. చివరగా ఆగస్టు 15 ఆదివారం నాడు దేశరాజధాని కాబూల్ కూడా ఉగ్రమూకల వశమైంది. ఆ దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ పారిపోవడంతో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో అడుగు పెట్టిన తాలిబన్లు.. తమను తాము అఫ్ఘాన్ పాలకులుగా ప్రకటించుకున్నారు.


అప్పటి నుంచి అఫ్ఘాన్ ప్రజలు పరుగులు తీయడం ప్రారంభించారు. కాబూల్ విమానాశ్రయం ఇంకా తాలిబన్ల ఆధీనంలోకి రాలేదని తెలిసి, ఎయిర్ పోర్టులోకి వెళ్లేందుకు ప్రాణాలరచేతిలో పెట్టుకొని పరిగెత్తారు. విమానాశ్రయం నుంచి బయలుదేరుతున్న అమెరికా మిలటరీ విమానం చక్రాలు పట్టుకొని వేళ్లాడారు. ఎలాగైనా దేశం విడిచి పారిపోవాలనే ఆశ వారి అణువణువూ నిండిపోయింది. అందరూ ఈ దృశ్యాలను షాకైపోయి చూశారు కానీ.. అసలు అఫ్ఘాన్ పౌరులు ఎందుకు తమ దేశం వదిలి వెళ్లిపోతున్నారు? తాలిబన్లు అంటే వాళ్లకు ఎందుకంత భయం? అసలు వాళ్లను భయపెడుతోంది తాలిబన్లేనా? అని ఆలోచిస్తే దీని వెనుక మతపరమైన ఒక పోరు కనిపిస్తుంది.


భయానికి కారణం తాలిబన్లేనా..?

అఫ్ఘాన్ పౌరులను తాలిబన్ల కన్నా వాళ్లు పాటించే షరియా చట్టాలే ఎక్కువగా భయపెడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. షరియా అంటే ఖురాన్, సున్నాహ్, హదిత్ మతగ్రంధాల నుంచి తీసుకున్న నిబంధనల సమాహారమే షరియా. వీటి నుంచి నేరుగా చట్టాలు రావుకానీ, మతసంబంధ విజ్ఞులు ఈ గ్రంథాలను అనుసరించి ముస్లింలు ఎలా జీవించాలో నిర్దేశిస్తారు. షరియా చట్టంలో ముస్లింలు ఎలా జీవించాలనే విధానాన్ని చెప్తారు. ఎప్పుడు ప్రార్థనలు చేయాలి? ఎప్పుడు ఉపవాసాలు ఉండాలి? ఎలాంటి వారికి దానాలు చేయాలి? దేవుని ఆదేశాల మేరకు ఎలా జీవించాలనే విషయాన్ని ముస్లింలు అర్థం చేసుకోవడానికి ఈ షరియా చట్టం ఉపయోగపడుతుంది. అయితే దీన్ని తాలిబన్లు చాలా కఠినంగా అమలు చేస్తారు. అందుకే ప్రజలకు తాలిబన్లు అన్నా, వారి చట్టాలన్నా వణుకు.


షరియా అంటే ఏంటి?


షరియా అంటే సరైన అర్థం ‘భగవంతుని చేరే మార్గం’. జీవితంలో ఏ విషయంలో అయినా సమస్య వస్తే షరియా చట్టాలను ఆశ్రయించవచ్చు. ఈ చట్టాలు తెలిసిన స్కాలర్స్.. మతపరమైన ఫ్రేమ్ వర్క్‌లో సదరు సమస్యను ఎలా అధిగమించాలో చెప్తారు. కుటుంబ చట్టాలు, ఆర్థిక వ్యాపార సంబంధిత అంశాల్లో కూడా షరియా చట్టాలగ మార్గనిర్దేశం చేస్తాయట. ప్రపంచంలోని ఏ న్యాయవ్యవస్థ అయినా చాలా సంక్లిష్టంగా ఉంటుంది. షరియా చట్టం కూడా అంతే. ఈ చట్టాలు అమలు చేసే వారి విజ్ఞత, అనుభవంపై ఆధారపడి ఉంటాయి.


ఇస్లామిక్ జ్యూరిస్టులు చేసే చట్టాలను ఫత్వాలంటారు. షరియాకు సంబంధించి ఐదు రకాల విద్యాభ్యాసాలున్నాయి. వాటిలో నాలుగు సున్నీ విధానాలు, అవి హన్‌బలి, మాలికి, షఫిఈ, హనాఫీ. మరొకటి షియా విధానం, జాఫరీ. ఈ ఐదు విధానాల్లో షరియా చట్టాలను భిన్నంగా వివరిస్తాయి. అలాగే స్థానిక సంప్రదాయాలు, ఆచారాలు కూడా ఈ చట్టంపై ప్రభావం చూపుతాయి. అంటే వివిధ ప్రాంతాల్లో ఈ చట్టాలు వేరే వేరేగా ఉండొచ్చు. తాలిబన్లు వీటిలో చాలా క్రూరమైన విధానాలను అమలు చేస్తారు.


నేరాల గురించి ‘షరియా’ ఏం చెప్తుంది?

షరియా ముస్లింల జీవన విధానానికి సంబంధించిందే అయినా.. నేరాలకు ఎలాంటి శిక్షలు వేయాలో కూడా దీనిలో ఉంటుంది. ఈ చట్టాలు నేరాలను ప్రధానంగా మూడు విభాగాలుగా వర్గీకరిస్తాయి. అవి హుదుద్, ఖిసాస్, తాజిర్. హుదుద్ అంటే చాలా సీరియస్ నేరాలు. వీటికి చాలా క్రూరమైన శిక్షలుంటాయి. రెండో వర్గమైన ఖిసాస్‌లో ఎటువంటి నేరం చేశారో అదే నేరాన్ని నిందితుడికి శిక్షగా వేస్తారు. మూడో వర్గమైన తాజిర్ నేరాలకు వేసే శిక్షలు సదరు కేసులో జడ్జి విజ్ఞతకే వదిలేయడం జరుగుతుంది. ఈ హుదుద్ నేరాల్లో దొంగతనం, అక్రమ సంబంధాలు వంటివి ఉంటాయి. ఉదాహరణకు ఎవరైనా దొంగతనం చేశారనుకోండి. షరియాలోని కఠిన చట్టాలననుసరించి వారి చేతులు నరికేస్తారు. అలాగే ఎవరైనా స్త్రీ, పురుషులు అక్రమసంబంధం కలిగి ఉన్నట్లు తెలిస్తే వారిని నడిరోడ్డుపై రాళ్లతో కొట్టి చంపుతారు.


మహిళలకు మరింత కఠినం..

షరియా చట్టాలు మహిళల విషయంలో చాలా కఠినంగా ఉంటాయి. వాళ్లు ఎలాంటి దుస్తులు ధరించాలి? ఎవరితో మాట్లాడాలి? వంటి అంశాలను కూడా వివరిస్తాయి. ఈ చట్టాల ప్రకారం, స్త్రీలు ఒంటరిగా ఇంటి నుంచి బయటకు రాకూడదు. పరాయి పురుషుడితో మాట్లాడకూడదు. కుటుంబాలతో కలిసి పార్టీలకు వెళ్లడానికి షరియా చట్టం అనుమతిస్తుంది. కానీ పార్టీకి వెళ్లిన తర్వాత పరాయి కుటుంబంలోని మహిళలతో మాట్లాడితే అది నేరం! అంటే మనకు తెలిసినట్లు ‘అన్నయ్యగారూ..’ అంటూ పలకరించడం కూడా శిక్షార్హమే. అలాగే స్త్రీలు పూర్తిగా శరీరాన్ని కప్పుకునే దుస్తులే ధరించాలి. వాళ్లు చదువుకోవడానికి వీల్లేదు. 8 ఏళ్లు దాటిన ప్రతి అమ్మాయీ బుర్ఖా ధరించాల్సిందే. ఈ అమ్మాయిలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే పక్కనే ఎవరో ఒక పురుషుడు తోడుండాల్సిందే.


ఈ పీడకలలన్నీ గుర్తుకు రావడం వల్లే అఫ్ఘాన్ మహిళలు తమ దేశం విడిచి పారిపోవాలని భావిస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎవరూ ఇంత కఠినమైన నిబంధనలు అమలు చేయలేదు. సాధారణ జీవనం సాగించారు. ఇప్పుడు తాలిబన్లు అధికారంలోకి రావడంతో వీళ్ల గత జీవన విధానన్ని తప్పుబట్టి, ఇప్పుడు శిక్షలు వేస్తారేమో అని అఫ్ఘాన్ల భయం. అఫ్ఘాన్ మహిళలు కొందరు సైన్యంలో పనిచేయగా, మరికొందరు ఎన్నికల్లో నిలబడి మేయర్లుగా గెలిచారు. వీళ్లంతా ఇప్పుడు తాలిబన్ల దృష్టిలో భయంకరమైన పాపం చేసినవాళ్లే. ఇలాంటి వారిని వాళ్లు బహిరంగంగా తల నరికి చంపుతారు. ఇలాంటి భయాలే తాలిబన్ రాజ్యం నుంచి ప్రజలు పారిపోయేలా చేస్తున్నాయి.


ఆడవాళ్లు హైహీల్స్ కూడా వేసుకోకూడదు. ఎందుకంటే మహిళల అడుగుల చప్పుడు ఏ పురుషుడుకీ వినిపించకూడదు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు మాట్లాడితే ఆ మాటలు పరాయి పురుషుడికి వినిపించకూడదు. అంగే బయట ఉన్నప్పుడు స్త్రీలు గట్టిగా మాట్లాడకూడదు కూడా. మహిళల ఫొటోలు తీయడం, వీడియోలు చేయకూడదు. న్యూస్‌పేపర్లు, పుస్తకాలు, షాపుల్లో ఆడవాళ్ల ఫొటోలు పెట్టడం నిషేధం. ఇంటి బాల్కనీల్లో మహిళలు కనిపించకూడదు. గతంలో తాలిబన్లు అఫ్ఘానిస్థాన్‌ను పాలించిన సమయంలో ఈ నిబంధనలు ఉల్లంఘించిన మహిళలను రోడ్డుపై పడేసి కొట్టేవారు. ఒక్కోసారి రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచేవాళ్లు. కొన్ని అరుదైన ఘటనల్లో బహిరంగంగా తల నరికి చంపేవారు.

Updated Date - 2021-08-20T16:29:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising