ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మా.. కాస్త మంచినీళ్లు ఇస్తారా..? అని సెక్యూరిటీ గార్డు అడగడంతో సరేనని ఇంట్లోకెళ్లిందామె.. ఆ తర్వాత ఊహించని ఘోరం జరిగిందిలా..!

ABN, First Publish Date - 2021-11-11T00:58:23+05:30

ముంబైలో ఓ ఘోరం జరిగింది. మంచి నీళ్లు ఇస్తారా మేడం అంటూ వేడుకున్న ఓ వ్యక్తి.. నీరు తెచ్చే లోపు లోపలికి వెళ్లి చేసిన పని ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రామాలకు, పట్టణాలకు చాలా తేడా ఉంటుంది. గ్రామాల్లో ప్రజల మధ్య ఉన్న స్నేహభావం.. పట్టణాల్లో కనిపించదు. కనీసం పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలీని పరిస్థితిలో ఉంటారు. ఒకవేళ ఏం జరిగినా మనకెందుకులే అని పట్టించుకోరు. దీన్నే చాలా మంది అవకాశంగా తీసుకుని నేరాలకు పాల్పడుతుంటారు. ముంబైలో ఇలాగే ఓ ఘోరం జరిగింది. మంచి నీళ్లు ఇస్తారా మేడం అంటూ వేడుకున్న ఓ వ్యక్తి.. నీరు తెచ్చే లోపు లోపలికి వెళ్లి చేసిన పని ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..


దేశ ఆర్థిక రాజధాని ముంబై పరిధి మెట్రోపాలిటన్ సిటీ థానేలో జరిగిందీ ఘటన. అక్కడి ఓ హౌసింగ్ సొసైటీలో చాలా మంది నివాసం ఉంటున్నారు. ఓ ఇంట్లో 65ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా నివాసం ఉంటోంది. అదే కమ్యూనిటీకి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న వ్యక్తి అందరితో కలివిడిగా ఉండేవాడు. అపార్ట్‌మెంట్‌వాసులు కూడా అతన్ని బాగా నమ్మారు. ఎవరి ఇంట్లో ఎవరెవరు ఉంటారు.. ఏం చేస్తుంటారు.. తదితర వివరాలన్నీ అతడికి తెలుసు. ఇదే క్రమంలో వృద్ధురాలు ఒంటరిగా ఉండడాన్ని రోజూ గమనించేవాడు. ఈ నెల 3వ తేదీన వృద్ధురాలి ఇంట్లోకి వెళ్లి.. అమ్మా మంచి నీరు ఇస్తారా.. అంటూ వినయంగా అడిగాడు. సరే అంటూ ఆమె లోపలికి వెళ్లింది.


నీళ్లు తేవడానికి వెళ్లగానే ఇతను కూడా లోపలికి వెళ్లాడు. ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి బెదిరించాడు. అరవకుండా నోటిని అదిమిపట్టి, అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎంత వద్దని వేడుకుంటున్నా కనికరం చూపలేదు. బయటికి చెబితే చంపేస్తానంటూ బెదిరించి వెళ్లిపోయాడు. అయితే వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న థానే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎట్టకేలకు మంగళవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం అతన్ని రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2021-11-11T00:58:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising