ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెల్లవారితే పెళ్లి.. రాత్రంతా వరుడితో ఉన్న వధువు.. ముహూర్తానికి కాస్త ముందు మారిన సీన్..

ABN, First Publish Date - 2021-11-15T00:22:13+05:30

చిత్తూరు జిల్లా మదనపల్లి మండల పరిధిలోని గ్రామానికి చెందిన సోనికకు, అదే మండలానికి చెందిన నవీన్‌కుమార్‌కు పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం పొద్దునే పెళ్లి ఉండడంతో అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. పెళ్లి పనుల్లో

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు అమ్మాయిలు విచిత్రంగా ఉంటారు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ తెలీదు. ఉన్నట్టుండి అందరికీ షాక్ ఇస్తుంటారు. కొన్నిసార్లు పెద్దలు కుదిర్చిన వివాహాల్లో యువతులు.. చివరి నిముషంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తుంటారు. తాళి కట్టే వరకూ బయటపడని వారు.. సినిమాలో చూపించినట్లుగా చివరి నిముషంలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తద్వారా తల్లిదండ్రులకు తలవంపులు తెస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో కూడా ఇలాగే జరిగింది...


చిత్తూరు జిల్లా మదనపల్లి మండల పరిధిలోని గ్రామానికి చెందిన సోనికకు, అదే మండలానికి చెందిన నవీన్‌కుమార్‌కు పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం పొద్దునే పెళ్లి ఉండడంతో అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. పెళ్లి పనుల్లో అంతా హడావుడిగా ఉన్నారు. శనివారం రాత్రి ఇరు కుటుంబాల బంధువులు, సన్నిహితులంతా కళ్యాణ మండపానికి చేరుకున్నారు. అందరి సమక్షంలో రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు. ఆ సమయంలో వరుడి పక్కన సంతోషంగా ఉన్న వధువు.. తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు.


ముహూర్త సమయం దగ్గర పడుతుందనగా మండపంలో వధువు కనపడలేదు. పెళ్లికూతురు ఎక్కడికెళ్లిందంటూ అంతా చర్చించుకుంటున్నారు. లోపల ఎక్కడ వెతికినా కనిపించలేదు. ఊహించని ఈ పరిణామానికి పెళ్లికొడుకు, పెళ్లికూతురు బంధువులంతా షాక్ అయ్యారు. పెళ్లి ఇష్టంలేని ఆ యువతి.. తాను ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయినట్లుగా తర్వాత తెలుసుకున్నారు. వరుడి కుటుంబ సభ్యులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోనిక కోసం గాలిస్తున్నారు. తీరా పెళ్లి వరకు వచ్చిన తర్వాత.. యువతి ఇలా ప్రవర్తించడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి.

Updated Date - 2021-11-15T00:22:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising