ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు కొనకుండానే రూ. 6 లక్షల ఖరీదైన నంబరు ప్లేటు కొన్నాడు!

ABN, First Publish Date - 2021-04-04T12:01:47+05:30

చాలామందికి తమ వాహనాలకు వీఐపీ నంబర్ ప్లేటు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: చాలామందికి తమ వాహనాలకు వీఐపీ నంబర్ ప్లేటు పెట్టుకోవాలని కోరికగా ఉంటుంది. ఇందుకోసం కొంతమంది లక్షల రూపాయలు ఖర్చు చేసేందుకు సైతం వెనుకాడరు. అయితే యూపీ రాజధాని లక్నోకు చెందిన ఒక వ్యక్తి ఈ వీఐపీ నంబరు దక్కించుకునేందుకు ఆరు లక్షల రూపాయలు వెచ్చించాడు. నిజానికి ఇంత మొత్తంతో కారు కొనుగోలు చేయవచ్చు. 

లక్నోలో వీఐపీ నంబరు ఎంఎ 0001 కోసం వేలం నిర్వహించారు. ఇది ఒక  లక్ష రూపాయలతో మొదలై రూ. 6 లక్షల వరకూ చేరుకుంది. చివరగా ప్రవీణ్ అనే వ్యక్తి రూ. 6 లక్షలు వెచ్చించి ఈ వీఐపీ నంబరు సొంతం చేసుకున్నాడు. కాగా ఇంతవరకూ ఏ వీఐపీ నంబరు కూడా ఇంత మొత్తానికి అమ్ముడుపోలేదు. గతంలో వీఐపీ నంబరు రూ. 4 లక్షల  10 వేల రూపాయల అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. అయితే ఇప్పుడు పాత రికార్డులన్నీ బద్దలయ్యాయి. మార్చి 27న ప్రారంభమైన ఈ వీఐపీ నంబరు వేలం ఏప్రిల్ 2తో ముగిసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమొకటుంది. రూ. 6 లక్షల ఖరీదైన నంబరు సొంతం చేసుకున్న ప్రవీణ్ ఇంతవరకూ కారును కొనుగోలు చేయలేదు. అయినా ఖరీదైన వీఐపీ నంబరు కొనుగోలు చేశాడు. అయితే రవాణాశాఖ నిబంధనల ప్రకారం 30 రోజులలోపు కారు కొనుగోలు చేసి ఈ నంబరు దానికి జతచేయాల్సివుంటుంది. ఇలా చేయని పక్షంలో ప్రవీణ్ ఈ నంబరును తిరిగి ఆర్టీఓకు అప్పగించాల్సివుంటుంది. కాగా వేలం చివరి రోజున లక్నోలో ఆర్టీఓ తరపున మొత్తం ఆరు వీఐపీ నంబర్లను విక్రయించారు. దానిలోని 9000 నంబరును ఒక వ్యక్తి 50 వేల 500 రూపాయలకు కొనుగోలు చేశాడు. 

Updated Date - 2021-04-04T12:01:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising