ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: బాబోయ్.. ఈ వీడియో చూస్తే మార్కెట్లో ఏం కొనాలన్నా భయపడతారేమో..!

ABN, First Publish Date - 2021-10-29T01:47:59+05:30

నెట్టింట ప్రస్తుతం ఓ కూరగాయల వ్యాపారికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆ వ్యాపారి చేసింది చూసిన తర్వాత బహుశా అతడిని తిట్టకుట్టకుండా ఉండలేరేమో. అతడిని తిట్టడం మాట అటుంచితే.. ఇకపై మార్కెట్‌లో ఏ కూరగాయ కొనాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: నెట్టింట ప్రస్తుతం ఓ కూరగాయల వ్యాపారికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆ వ్యాపారి చేసింది చూసిన తర్వాత బహుశా అతడిని తిట్టకుట్టకుండా ఉండలేరేమో. అతడిని తిట్టడం మాట అటుంచితే.. ఇకపై మార్కెట్‌లో ఏ కూరగాయ కొనాలన్నా.. భయపడుతారమో. అంత భయపెట్టే దృశ్యాలు ఆ వీడియోలో ఏమున్నాయనేగా మీ సందేహం. సరే.. అక్కడికే వెళ్దాం పదండి..



మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తి.. పని మీద బయటకు వెళ్తుండగా రోడ్డు పక్కన కూరగాయాలు అమ్ముకునే వ్యక్తి.. దారుణానికి పాల్పడటాన్ని కళ్లారా చూశాడు. తన వద్ద ఉన్న కొత్తిమీర కట్టలు తాజాగా కనిపించాలనే ఉద్దేశంతో వ్యాపారి.. పక్కనే ఉన్న మురుగు కాలువలోని నీటిని ఉపయోగించడాన్ని గమనించాడు. కొత్తిమీర కట్టలను మురుగు కాలువలో ఉన్న నీటిలో ముంచి తీస్తుండటం చూసి.. అతడు ఒక క్షణంపాటు షాకయ్యాడు. అనంతరం ఆ వ్యాపారి చేస్తున్న దారుణాన్ని వీడియో తిసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్, పోలీస్ డీఐజీకి ఆ వీడియోను షేర్ చేస్తూ.. ఆ వ్యాపారిపై ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేశారు. కాగా.. ప్రస్తుతం సదరు వ్యాపారి పరారీలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆ వ్యాపారి ఫోన్ స్విచ్ఛాప్ వస్తోందని.. ఇంటి అడ్రస్‌కు వెళ్తే అక్కడ సదరు వ్యాపారి లేడని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. వ్యాపారికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో స్పందిస్తున్న నెటిజన్లు ఆ వ్యాపారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్ చేస్తున్నారు. 






Updated Date - 2021-10-29T01:47:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising