ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: మీరు చాలా రకాల సమోసాలు చూసుంటారు.. కానీ ఇలాంటి సమోసాలు మాత్రం చూసుండరు..

ABN, First Publish Date - 2021-12-28T22:28:02+05:30

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ దుకాణదారుడు.. సమోసాలను అందరూ చేసే విధంగా కాకుండా వెరైటీగా ట్రై చేశాడు. ఆ సమోసాను తిన్న వారిలో కొందరు బాగుందని అంటుంటే.. మరికొందరు మాత్రం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోజన ప్రియుల అభిరుచికి తగ్గట్టుగా.. కొందరు రోజూ చేసే మాదిరి కాకుండా తినుబండారాలను విభిన్నంగా తయారు చేస్తుంటారు. తద్వారా కస్టమర్లను ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలోనూ చాలా చూస్తుంటాం. అలాంటి  కొన్ని వినూత్నమైన వంటకాలు ప్రజాదరణ పొందుతుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ దుకాణదారుడు.. సమోసాలను అందరూ చేసే విధంగా కాకుండా వెరైటీగా ట్రై చేశాడు. ఆ సమోసాను తిన్న వారిలో కొందరు బాగుందని అంటుంటే.. మరికొందరు మాత్రం.. ఇదేం కాంబినేషన్ రా నాయనా.. అంటూ ముఖం చిట్లించుకుంటున్నారు.


ఢిల్లీలో ఓ దుకాణదారుడు విభిన్నంగా గులాబ్‌జామూన్ సమోసా అంటూ కొంత రకం సమోసాలను విక్రయిస్తున్నాడు. గులాబ్‌జామ్‌లను సమోసాలో కుక్కి నూనెలో వేయించడం మనం కింది వీడియోలో చూడొచ్చు. ఇటీవల అభిషేక్‌ అనే ఫుడ్ బ్లాగర్.. ఈ దుకాణం వద్దకు వెళ్లాడు. కొత్తగా ఉందే అనుకుంటూ ఓ సమోసాను తీసుకున్నాడు. అయితే నోట్లో పెట్టుకున్న వెంటనే వింత వింతగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు.  ‘మీరెప్పుడైనా ఈ గులాబ్ జామూన్ సమోసాను ట్రై చేశారా’.. అని క్యాప్సన్ ఇస్తూ వీడియోను తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియోను చూసిన వారంతా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరైతే గులాబ్‌జామ్ సమోసా ఎంట్రా.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి.. అంటూ చమత్కరిస్తున్నారు.

అతనంటే ఈ ఏనుగులకు ఎంత అభిమానం.. చాలా కాలం తర్వాత చూడడంతో.. ఒక్కసారిగా..



Updated Date - 2021-12-28T22:28:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising