ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పటి వరకూ చెరువులా పొలం.. సడెన్‌గా పెల్లుబికిన నేల.. అసలేమైందంటే..

ABN, First Publish Date - 2021-07-23T21:20:38+05:30

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఒక పంట పొలం పెల్లుబికింది. సుమారు ఐదడుగుల ఎత్తుకు ఉబ్బింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఒక పంట పొలం పెల్లుబికింది. సుమారు ఐదడుగుల ఎత్తుకు ఉబ్బింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హరియాణాలోని కర్నాల్ జిల్లాలో ఒక రైతు తన పొలంలో మట్టి తవ్వించాడట. ఆ తర్వాత సుమారు 15 అడుగుల మేర రైస్ మిల్లు నుంచి తీసుకొచ్చిన బూడిద పోశారట. దానిపై మరో 3 అడుగులు మట్టిపోయించారు. దీనిలో పంట వేశాడు.


ఈ క్రమంలో మూడు నాలుగు రోజుల నుంచి హరియాణాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలతో పొలం మొత్తం చెరువులా తయారైంది. అదే సమయంలో నెమ్మదిగా పొలంలోని నేల ఉబ్బటం ప్రారంభించింది. అలా పెరిగి పెరిగి సుమారు అడుగుల ఎత్తుకు ఎదిగిందా పొలం నేల. ఈ ఘటన జరిగినప్పుడు పొలం వద్ద ఉన్న కొందరు రైతులు ఆశ్చర్యపోయాగా.. కొందరు దీన్ని వీడియో తీశారు. జూలై 15న ఈ వింత ఘటన జరిగినట్లు సమాచారం. అప్పటి నుంచి ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. భూమిలోని బూడిదలోని కొన్ని మినరల్స్ వల్లే ఇలా జరిగిందని చెప్తున్నారు. నీటితో కలవడంతో ఈ మినరల్స్ ఇలా స్పందించాయని, ఆ మట్టి మళ్లీ సాధారణ స్థాయికి చేరుకున్న తర్వాత పంటలు వేసుకోవచ్చని తెలిపారు. ఈ ఘటన వల్ల పొలంలోని నేలకు ఎటువంటి సమస్యా రాదని స్పష్టంచేశారు.



Updated Date - 2021-07-23T21:20:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising