ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కడి వారికి 11 గంటల తరువాత ఒంటిగంట వస్తుంది.. అద్భుత శక్తులే దీనికి కారణమట..

ABN, First Publish Date - 2021-11-03T17:46:41+05:30

ప్రపంచంలోని ఆ ప్రాంతంలో వింతైన గడియారాలుంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలోని ఆ ప్రాంతంలో వింతైన గడియారాలుంటాయి. అయితే అవి 12 గంటలకు మోగవు. ఇది వినగానే వింతగా అనిపించవచ్చు. కానీ ఇదే నిజం. పైగా ఈ గడియారాలలో 12 అనే అంకె ఉండదు. 11 నంబరు తరువాత నేరుగా ఒంటి గంట ఉంటుంది. ఇలా ఉండటం వెనుక అత్యంత ఆశ్చర్యకరమైన కథనం ఉంది. దీనిని తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.. ఈ వింతైన గడియారాలు స్విట్జర్లాండ్‌లోని సోలోథర్న్ పట్టణంలో గల టౌన్ స్క్వేర్‌లో కనిపిస్తాయి. 


ఈ గడియారాల్లో కేవలం 11 అంకెలు మాత్రమే ఉంటాయి. 12వ నంబరు కనిపించదు. స్విట్లర్లాండ్‌లో చాలా గడియారాలు ఉన్నప్పటికీ వేటిలోనూ 12 గంటలు కొట్టవు. దీనికి కారణం ఈ ప్రాంతవాసులకు 11 వ నంబరు అంటే ఎంతో ఇష్టం. ఫలితంగా ఈ ప్రాంతంలో తయారయ్యే వస్తువులను 11 వ నంబరును పోలి ఉండేలా తయారు చేస్తుంటారు. సోలోథర్న్ పట్టణంలోగల ప్రధాన చర్చిలో 11 వ నంబరు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ చర్చి నిర్మించి 11 ఏళ్లు పూర్తికావడం మరో విశేషం. ఈ చర్చికి 11 మెట్లు ఉండటంతో పాటు 11 తలుపులు ఉంటాయి. అలాగే చర్చిలో 11 గడియారాలు కూడా ఉంటాయి. ఈ పట్టణంలోని ఎవరిదైనా 11వ పుట్టినరోజు జరిగితే వేడుకలు అంబరాన్ని అంటుతాయి.  వారికి 11 రకాల గిఫ్టులు ఇస్తారు.  ఈ ప్రాంతవాసులు 11వ నంబరును ఇష్టపడటం వెనుక ఒక కథనం కూడా ఉంది. పూర్వకాలంలో ఈ ప్రాంతానికి చెందినవారు ఎంత శ్రమించినప్పటికీ తగిన ఫలితం ఉండకపోవడంతో పాటు సమస్యలు వెంటాడేవట. ఈ సమయంలో కొండలపై నుంచి అద్భుత శక్తులు గల వ్యక్తి వచ్చి వారి సమస్యలను పరిష్కరించి, ఆనందాన్ని అందించాడట. ఆ అద్భుత శక్తులు గల వ్యక్తి 11 వ నంబరుకు సంకేతమని ఇక్కడి వారు భావిస్తుంటారు. అందుకే వారు 11 వ నంబరును శుభసూచకంగా భావిస్తారు.

Updated Date - 2021-11-03T17:46:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising