ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏంటి ఇలాక్కూడా జరుగుతుందా! తమ లవ్ ఎంత స్ట్రాంగో తెలుసుకోవాలని ఈ జంట ఏకంగా..

ABN, First Publish Date - 2021-02-19T01:46:08+05:30

ప్రేమికులు ఒకరినొకరు విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేరు. తమది జన్మజన్మల బంధం అని అనుకుంటూ ఉంటారు. ఊహల్లో విహరిస్తుంటారు. మనసుకు నచ్చిన వారి సాగత్యంలో ప్రపంచాన్నే మరిచిపోతారు. యూక్రెయిన్‌కు చెందిన ఓ యువ జంట కూడా యాజిటీజ్ ఇలాగే ఫీలైంది. అయితే..ఇలా ఫీలంగులతో సరిపెడితే వర్కవుట్ కాదని భావించి ఓ అడుగు ముందుకేసి.. తమ బంధం ఎంత గట్టిదో తేల్చుకోవాలని నిశ్చయించుకుంది. అందుకోసం ప్రత్యేకంగా ఓ ప్రేమ పరీక్షను కూడా డిజైన్ చేసింది. వ్యాలైంటేన్స్ డే నాడు ఆ ప్రేమికులు తమకు తాము ఓ వింత పరీక్ష పెట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రేమికులు ఒకరినొకరు విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేరు. తమది జన్మజన్మల బంధం అని అనుకుంటూ ఉంటారు. ఊహల్లో విహరిస్తుంటారు. మనసుకు నచ్చిన వారి సాగత్యంలో ప్రపంచాన్నే మరిచిపోతారు. యూక్రెయిన్‌కు చెందిన ఓ యువ జంట కూడా సేమ్‌టుసేమ్ ఇలాగే ఫీలైంది. అయితే..ఇలా ఫీలింగ్స్‌తో సరిపెడితే వర్కవుట్ కాదని భావించి ఓ అడుగు ముందుకేసి.. తమ బంధం ఎంత గట్టిదో తేల్చుకోవాలని నిశ్చయించుకుంది. అందుకోసం ప్రత్యేకంగా ఓ ప్రేమ పరీక్షను కూడా డిజైన్ చేసింది. వ్యాలైంటేన్స్ డే నాడు ఆ ప్రేమికులు తమకు తాము ఓ వింత పరీక్ష పెట్టుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేరని నిరూపించేందుకు ఉద్దేశించిన ఈ పరీక్షలో ప్రియురాలు.. విక్టోరియా ఓ ఇనుప గొలుసుతో తన ఎడమ చేతిని ప్రియుడు కుడిచేయితో అలెగ్జాండర్ ఎడమ చేయికి కట్టేసుకుంటుంది. ఇలా వారు మూడు నెలల పాటు గడపాలి. 


అంటే.. భోజనం, బాత్రూమ్‌లకు వెళ్లడం, దుస్తుల మార్చుకోవడం వంటివన్నీ అవతలి వ్యక్తి సమక్షంలోనే జరుగుతాయి. ఇందుకోసం వారు జిప్‌లు ఉన్న ప్రత్యేకమైన దుస్తులను డిజైన్ చేసుకున్నారు. ఇక యూక్రెయిన్‌కు చెందిన నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ రికార్డ్స్ ఉద్యోకి ఒకరు ఈ మొత్తం వ్యవహారాన్ని దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. గోలుసును తెంపుకునేందుకు వీలు లేకుండా వెల్డింగ్ చేసి దానిపై ఓ సీల్ కూడా వేశారు. ఒకవేళ వారు ఈ టెస్ట్‌‌ను మధ్యలోనే ముగించాలనుకుంటే..ప్రత్యేక సామాగ్రి ద్వారా వీటిని తెంచాల్సి ఉంటుంది. సో..పరీక్ష మధ్యలో ‘గిమ్మిక్కులు’ చేద్దామంటే కుదరదు. అయితే..ఈ జంట మాత్రం అప్పుడే  పరీక్షలో తోలి విజయాన్ని సాధించారు. తాము ప్రస్తుతం ఉన్న రాజధాని కియవ్ నుంచి 350 కిమీల దూరంలో ఉన్న మరో ప్రాంతానికి టాక్సిలో ప్రయాణించారు. ఈ సందర్భంగా వారు మూత్రశాలలకు జంటగానే వెళ్లారు. ఇద్దరి ఒకేసారి మహిళల బాత్రుమ్‌వె వెళుతుండగా చూసి వారు షాకైపోయారు. అయితే.. తాము ఈ పరీక్షలో కచ్చితంగా విజయం సాధిస్తామని ఈ సందర్భంగా వారు చెప్పారు. మరి వారు..అనుకున్నది సాధిస్తారా.. మధ్యలోనే చిరాకు పుట్టి విడిపోతారా అనేది తెలియాలంటూ మరో మూడు నెలల పాటు వేచి చూడాల్సిందే!

Updated Date - 2021-02-19T01:46:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising