ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KFCలో చికెన్ వింగ్స్ ఆర్డర్ చేసిన మహిళ.. తినేందుకు పార్శల్ ఓపెన్ చేసి ఒక్కసారిగా షాక్.. ఆ తర్వాత వెంటనే..

ABN, First Publish Date - 2021-12-23T23:18:54+05:30

కేఎఫ్‌సీలో చికెన్ వింగ్స్ ఆర్డర్ చేసిన మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. దీంతో ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఆహారాన్ని ఆమె డస్ట్‌బిన్‌లో పడేసింది. ఆ తర్వాత ఆమె చేసిన పనికి ఏకంగా కేఎఫ్‌సీ దిగొచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా హాట్ టాపి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కేఎఫ్‌సీలో చికెన్ వింగ్స్ ఆర్డర్ చేసిన మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. దీంతో ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఆహారాన్ని ఆమె డస్ట్‌బిన్‌లో పడేసింది. ఆ తర్వాత ఆమె చేసిన పనికి ఏకంగా కేఎఫ్‌సీ దిగొచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా హాట్ టాపిక్‌ అయింది. కాగా.. కేఎఫ్‌సీలో చికెన్ వింగ్స్ ఆర్డర్ చేసిన మహిళ ఎదుర్కొన్న ఆ షాకింగ్ ఘటన ఏంటి? ఆ తర్వాత ఆమె ఏం చేసింది? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



బ్రిటన్‌కు చెందిన ఓ మహిళకు చికెన్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే ఆమె స్థానికంగా ఉన్న కేఎఫ్‌సీ ఔట్‌లెట్‌కు వెళ్లింది. అక్కడ చికెన్ వింగ్స్‌ను ఆర్డర్ చేసి, పార్శల్‌ను ఇంటికి పట్టుకెళ్లింది. అనంతరం ఎంతో ఇష్టపడి తెచ్చుకున్న చికెన్ వింగ్స్‌ను తినేందుకు పార్శల్‌ ఓపెన్ చేసింది. ఈ క్రమంలో అందులో కనిపించిన సీన్ చూసి షాకైంది. పార్శల్‌లో కోడి తల రావడంతో.. ఆమె ఒక్కసారిగా కంగుతింది. దీంతో ఆ పార్శల్‌ను డస్ట్‌బిన్‌లో పడేసింది. అంతేకాకుండా.. ఆ కోడి తలను ఫొటో తీసి, తనకు కలిగిన అసౌకర్యాన్ని ఆన్‌లైన్‌లో వెల్లడించింది. ఆమె చేసిన పోస్ట్ వైరల్‌గా మారడంతో.. కేఎఫ్‌సీ సిబ్బంది స్పందించారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఆ మహిళ ఫ్యామిలీ మొత్తాన్ని కేఎఫ్‌సీకి ఆహ్వానించి.. ఫ్రీ ఫుడ్ ఆఫర్ చేశారు. 




Updated Date - 2021-12-23T23:18:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising