ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Israel Rare: జెరూసలేంలో 2,700 సంవత్సరాల నాటి పురాతన టాయిలెట్ వెలుగు చూసింది...

ABN, First Publish Date - 2021-10-06T17:43:14+05:30

అత్యంత పురాతన నగరమైన జెరూసలేంలో 2,700 సంవత్సరాల నాటి పురాతన టాయిలెట్‌ను ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెరూసలేం : అత్యంత పురాతన నగరమైన జెరూసలేంలో 2,700 సంవత్సరాల నాటి పురాతన టాయిలెట్‌ను ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. జెరూసలేంలోని అరుదైన పురాతన టాయిలెట్ ఫొటోను ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ విడుదల చేసింది. పవిత్ర నగరమైన జెరూసలేంలో 2,700 సంవత్సరాల క్రితం విలాసవంతమైన ప్రైవేటు బాత్‌రూమ్‌లున్నాయని తేలింది. మృదువైన రాయిపై సున్నపురాయితో నిర్మించిన దీర్ఘచతురాస్త్రాకార క్యాబిన్ లో ఉన్న టాయిలెట్ పాత నగరంలోని విశాల భవనంలో బయటపడింది. సౌకర్యవంతంగా కూర్చోవడానికి వీలుగా రూపొందించిన ఈ టాయిలెట్ కింద లోతైన సెప్టిక్ ట్యాంకు తవ్వారు. 


పురాతన కాలంలో టాయిలెట్ క్యూబికల్ నిర్మించడం చాలా అరుదైన విషయమని ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ డైరెక్టరు యాకోవ్ బిలిగ్ చెప్పారు.అప్పట్లో ధనవంతులు మాత్రమే మరుగుదొడ్లను కొనుగోలు చేయగలిగారని, అప్పటి ప్రఖ్యాత రబ్బీ ధనవంతుడు కావడంతో అతని టేబుల్ పక్కన టాయిలెట్ ఉందని ఇజ్రాయెల్ పురావస్తు శాఖ అధికారులు చెప్పారు. సెప్టిక్ ట్యాంకులో ఉన్న జంతువుల ఎముకలు, కుండలు, ఆ సమయంలో నివశించిన వ్యక్తుల జీవనశైలిని వెలుగులోకి తెస్తాయని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పారు. రాతితో నిర్మించిన రాజధాని నగరంలో స్తంభాల మధ్య పండ్ల తోటలు కూడా ఉన్నాయని ఇజ్రాయెల్ పురావస్తు శాఖ అధికారులకు తాజాగా ఆధారాలు దొరికాయి.

Updated Date - 2021-10-06T17:43:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising