ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 నెలలు కోమాలో ఉన్న వ్యక్తి మృతి.. మార్చురీలోనే శవం.. అసలు కథేంటో తెలిసి అవాక్కైన పోలీసులు.. చివరకు..

ABN, First Publish Date - 2021-09-17T21:48:28+05:30

అతడు పది నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.. 10 నెలల పాటు కోమాలో ఉండి గురువారం మరణించాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతడు పది నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.. 10 నెలల పాటు కోమాలో ఉండి గురువారం మరణించాడు.. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.. అయితే అతని అంత్య క్రియల విషయంలో వివాదం తలెత్తింది.. ఎందుకంటే అతనికి ఇద్దరు భార్యలు.. దాంతో ఇద్దరు భార్యల పిల్లల మధ్య గొడవ మొదలైంది.. ఒక రోజు గడిచినా మార్చురీ నుంచి శవాన్ని తీసుకెళ్ల లేదు.. దీంతో పోలీసులు కలుగజేసుకుని సర్దిచెప్పారు.. మధ్యప్రదేశ్‌లోని బింధ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


బింధ్ ప్రాంతానికి చెందిన సురేంద్ర అనే వ్యక్తి పాతికేళ్ల క్రితం మున్నీభాయ్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత భోపాల్‌కు చెందిన పింకీ శర్మను కూడా సురేంద్ర వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం వల్ల సురేంద్ర ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు. గత ఏడాది నవంబర్‌లో సురేంద్రకు యాక్సిడెంట్ అయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఇద్దరు భార్యల పిల్లలూ దగ్గరుండి అతడి యోగ క్షేమాలు చూసుకున్నారు. 


ఇవి కూడా చదవండి

పెళ్లయిన రెండు వారాల తర్వాత బాంబు పేల్చిన భార్య.. 



పెళ్లయిన మూడో రోజే భర్త నుంచి విడాకులు కోరిన నవ వధువు..


అతను చనిపోయి పోస్ట్‌మార్టమ్ కూడా అయిపోయిన తర్వాత అంత్యక్రియల విషయంలో వారి మధ్య వివాదం తలెత్తింది. ఆ హక్కు తమకు ఉందంటే తమకు ఉందని ఇద్దరు భార్యల పిల్లలూ గొడవపడ్డారు. దీంతో రోజు గడిచిపోయినా సురేంద్ర మృతదేహం మార్చురీలోనే ఉండిపోయింది. దీంతో పోలీసులు కలుగజేసుకోవాల్సి వచ్చింది. వారు ఇరు కుటుంబాల మధ్యా రాజీ కుదిర్చారు. హిందూ సాంప్రదాయం ప్రకారం మొదటి భార్యకు పెద్ద కొడుకుతో అంత్యక్రియలు జరిపించారు. 

Updated Date - 2021-09-17T21:48:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising