ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాలో కొత్త డైనోసార్లు.. 13 కోట్ల ఏళ్ల క్రితం..

ABN, First Publish Date - 2021-08-14T08:37:18+05:30

చైనాలో కొత్త డైనోసార్ల అవశేషాలను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ డైనోసార్లు దాదాపు 13 కోట్ల ఏళ్లనాడు భూమిపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: చైనాలో కొత్త డైనోసార్ల అవశేషాలను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ డైనోసార్లు దాదాపు 13 కోట్ల ఏళ్లనాడు భూమిపై తిరుగాడి ఉంటాయని వారు అంచనా వేస్తున్నారు. ఈ అవశేషాలు వాయువ్య చైనాలో శాస్త్రవేత్తలకు లభ్యమయ్యాయి. పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం రెండు కొత్త డైనోసార్ల అవశేషాలు కనుగొన్నారు. వీటికి సిలుటైటాన్ సైనెసిస్ అని, హమిటైటాన్ గ్జింజియాన్‌జెన్సిస్ అని పేరు పెట్టారు. ఇందులో సిలుటైటాన్ దాదాపు 20 మీటర్ల పొడవు ఉండేది. ఇక హమిటైటాన్ 17 మీటర్ల వరకు పొడవు ఉండేది. అంటే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పెద్ద జీవి అయిన నీలి తిమింగలం(20-23 మీటర్లు) సైజుకు దాదాపు దగ్గరన్నమాట. ఈ రెండు డైనోసార్లు సారోపోడ్ కుటుంబానికి చెందిన డైనోసార్లుగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.


కాగా.. ఈ ప్రాంతంలో ఇంతటి భారీ వెన్నెముక గల జీవుల అవశేషాలు  లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంతకుముందు కూడా ఇక్కడ ప్టిరోసారస్ అవశేషాలు, కొన్ని జీవుల గుడ్లు, పిండాల అవశేషాలు లభించాయి. అలాగే కొన్ని జీవుల నడుము ఎముకలు, పక్కటెముకలు కూడా లభించాయి. అయితే ఇప్పుడు లభించిన డైనోసార్ అవశేషాలు మాత్రం ఇప్పటివరకు రహస్యంగా ఉన్న మూడు జాతుల డైనోసార్ల కుంటుంబానికి చెందినవిగా అంచనా వేస్తున్నారు.

Updated Date - 2021-08-14T08:37:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising