ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరో తరగతి చదువుతున్న కొడుకు బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేసిన తండ్రికి మైండ్ బ్లాక్.. రూ.905 కోట్లు జమ..

ABN, First Publish Date - 2021-09-16T21:02:07+05:30

కుమారుడి ఖాతాలో రూ. 905 కోట్లు.. తండ్రికి మైండ్ బ్లాంక్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కౌన్ బనేగా కరోడ్‌పతీలో పాల్గొనలేదు.. లాటరీ తగల్లేదు.. కనీసం స్క్రాచ్ కూపన్ లాంటిది కూడా ట్రై చేయలేదు.. కానీ ఆ బాలుడి బ్యాంక్ ఖాతాలో మాత్రం ఏకంగా రూ.905 కోట్ల రూపాయలు! అతడు చదివేదేమో ఆరోతరగతి.. ఆ ఖాతాలో ప్రభుత్వం ఇచ్చే ఆర్థికసాయం జమకావాల్సి ఉంది. కానీ..తన కొడుకు అశిశ్ అకౌంట్లో వందల కోట్లు ఉండటం చూసిన అతడి తండ్రికి మైండ్ బ్లాంక్ అయింది.. కాళ్లకింద భూమి కదిలిపోతున్నట్టు అనిపించింది. మరో విద్యార్థి గురు చరణ్ విశ్వాస్ విషయంలోనూ దాదాపు ఇదే సీన్ రిపీటైంది! అతడి బ్యాంక్ బ్యాలెన్స్‌ కూడా దాదాపు రూ. 6 కోట్ల వరకూ ఉంది. బీహార్ రాష్ట్రం కటీహార్ జిల్లాలోని పస్తియా గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న ఘటన ఇది. ఇద్దరు విద్యార్థులు జాతకాలు ఇలా ఒక్కరాత్రిలో మారిపోవడంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. 

ఇవీ చదవండి..
గాడిద పాలతో సబ్బుల తయారీ.. భారీగా లాభాలు


SBI లో భారీ మోసం.. అసిస్టెంట్ మేనేజర్ పక్కా స్కెచ్..


విషయం దావానలంలా పాకిపోవడంతో.. గ్రామస్థులందరూ బ్యాంకుకు క్యూకట్టారు. తమ బ్యాలెన్స్ ఎంతో చెక్ చేసిపెట్టండంటూ..సిబ్బంది వెంట పడ్డారు. పిల్లలూ పెద్దలూ అనే తేడా లేకుండా.. గ్రామస్థులందరూ తమను అదృష్టదేవత కరుణించిదేమోనని తెలుసుకునేందుకు తెగ హడావుడి పడిపోయారు. అయితే.. విషయం బ్యాంకు వారి దృష్టికి వెళ్లగానే..బ్యాంకు మేనేజర్ అప్రమత్తమయ్యారు. ఆ ఇద్దరు విద్యార్థుల ఖాతాలను తాత్కాలికంగా స్తంభింపజేశారు. ఈ విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు.. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకునేందుకు బ్యాంకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వార్త స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

Updated Date - 2021-09-16T21:02:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising