ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కవల జంటల వివాహం... ఒకేసారి గర్భధారణ... తొలి శిశు జననం!

ABN, First Publish Date - 2021-03-31T17:00:50+05:30

ఇద్దరు కవల సోదరీమణులు మరో ఇద్దరు కవల సోదరులను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ఇద్దరు కవల సోదరీమణులు మరో ఇద్దరు కవల సోదరులను వివాహం చేసుకున్నారు. వారిలో ఒకరు తమ తొలి శిశువుకు జన్మనిచ్చారు. అమెరికాలోని వర్జీనియాకు చెందిన 33 ఏళ్ల బ్రిట్నీ, బ్రియానాలు 35 ఏళ్ల జోష్, జెరెమీ సల్యర్స్‌లను వివాహం చేసుకున్నారు. బ్రిట్నీ, బ్రియానాలు గత ఏడాది గర్భం దాల్చారు. అయితే బ్రిట్నీ ముందుగా శిశువుకు జన్మనిచ్చారు. 


ఈ సందర్భంగా ఆమె తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చే్స్తూ ‘నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఒక ఆరోగ్యవంతమైన కుమారునికి జన్మనిచ్చాను. నా భర్త కూడా తండ్రి అయినందుకు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడని’ రాశారు. ఈ జంటలు 2018 ఆగస్టులో వివాహం చేసుకున్నారు. ఒకే ఇంట్లో ఉంటూ, ఒకే సమయంలో గర్భవతులయ్యారు. వారిద్దరూ ఒకే రోజు కవల పిల్లలను కనాలని అనుకున్నారు. అయితే వారి కలలకు భిన్నంగా బ్రిట్నీ ముందుగా ఒక శిశువుకు జన్మనిచ్చింది. 


Updated Date - 2021-03-31T17:00:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising