ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లాడి ట్వీట్‌కు అధికారుల రిప్లై.. నెటిజన్లు ఫిదా!

ABN, First Publish Date - 2021-01-10T03:11:39+05:30

ఒక పిల్లాడు చేసిన ట్వీట్‌ను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. వెంటనే స్పందించి అతని సమస్యను తీర్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు చెందిన సాయి అనే పిల్లాడు తన సమస్యను రాజధాని ప్రాంత అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్: ఒక పిల్లాడు చేసిన ట్వీట్‌ను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. వెంటనే స్పందించి అతని సమస్యను తీర్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు చెందిన సాయి అనే పిల్లాడు తన సమస్యను రాజధాని ప్రాంత అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ‘‘స్కూల్లో నా రిపోర్టింగ్ టైం ఉదయం 7.30గంటలు. కానీ మా ఏరియాలో తొలి బస్సు మొదలయ్యేది 7.40గంటలకు. దీంతో రోజూ లేట్ అవుతున్నా’’ అంటూ సాయి ఓ ట్వీట్ చేశాడు. దీన్ని చూసిన అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ భువనేశ్వర్ ఎండీ అరుణ్ బోత్రా స్పందించారు. ‘‘ఇక నుంచి ఈ ప్రాంతంలో తొలి బస్సు ఉదయం 7గంటలకే మొదలవుతుంది. ఇకపై స్కూలుకు లేట్ అవ్వవు’’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ సమాధానానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. బోత్రా, ట్రాన్స్‌పోర్ట్ విభాగంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.



Updated Date - 2021-01-10T03:11:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising