ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

26 ఏళ్ల వయసు.. ఎస్సైగా జాబ్.. ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు.. హ్యాపీగా ఉండాల్సిన ఆమె జీవితం ఇలా టర్న్ తీసుకుందేంటి..?

ABN, First Publish Date - 2021-12-10T19:58:16+05:30

ఖాకీ దుస్తులు ధరించి.. పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తించాలనేది ఆమె కల. అది నిజం చేసుకోవడం కోసం కఠోరంగా శ్రమించింది. చివరికి అనుకున్నది సాధించింది. 26ఏళ్ల వయసులోనే ఎస్సై పోస్ట్‌కు సెలెక్ట్ అయింది. ఈ క్రమంలో ఇంట్లో వాళ్లు ఆమెకు పెళ్లి సం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఖాకీ దుస్తులు ధరించి.. పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తించాలనేది ఆమె కల. అది నిజం చేసుకోవడం కోసం కఠోరంగా శ్రమించింది. చివరికి అనుకున్నది సాధించింది. 26ఏళ్ల వయసులోనే ఎస్సై పోస్ట్‌కు సెలెక్ట్ అయింది. ఈ క్రమంలో ఇంట్లో వాళ్లు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. అయితే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాల్సిన ఆమె జీవితం సడన్‌గా టర్న్ తీసుకుంది. ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..



బిహార్‌లోని దర్భాంగా ప్రాంతానికి చెందిన లక్ష్మి కుమారి.. పోటీ పరీక్షలకు ప్రిపేరై ఎస్సైగా సెలెక్ట్ అయింది. ఈ క్రమంలోనే దర్భాంగా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ట్రైనీ ఎస్సైగా బాధ్యతలు చేపట్టింది. ఎప్పటిలాగే గురువారం కూడా డ్యూటీకి వెళ్లిన ఆమె.. సాయంత్రం తన అధికారిక నివాసానికి తిరిగొచ్చింది. గదిలోకి వెళ్లి డోర్ లాకేసుకుంది. అనంతరం అర్ధరాత్రి 12 గంటల తర్వాత సర్విస్ తుపాకీతో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. తుపాకీ శబ్దంతో ఉలిక్కపడ్డ స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న అధికారులు.. లక్ష్మి కుమారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా.. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. కాగా.. లక్ష్మి కుమారి మరణ వార్తను విని.. ఆమె కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 




Updated Date - 2021-12-10T19:58:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising