ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతీయుల్లో మెజార్టీ శాతం మంది వాడుతున్న passwood ఏంటో తెలుసా..? టాప్ 10 జాబితా ఇదీ..!

ABN, First Publish Date - 2021-11-20T00:06:43+05:30

ప్రస్తుతం ఇంటర్నెట్ యుగం నడుస్తోంది. మనకు సంబంధించిన సమస్త సమాచారం ఇంటర్నెట్‌లో ఉంటుంది. అయితే మన డేటా ఇంటర్నెట్‌లో భద్రంగా ఉండాలంటే.. పటిష్టమైన పాస్‌వర్డ్ తప్పనిసరి. పాస్‌వర్డ్ విషయంలో ఏమాత్రం.. అలసత్వం వహించినా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఇంటర్నెట్ యుగం నడుస్తోంది. మనకు సంబంధించిన సమస్త సమాచారం ఇంటర్నెట్‌లో ఉంటుంది. అయితే మన డేటా ఇంటర్నెట్‌లో భద్రంగా ఉండాలంటే.. పటిష్టమైన పాస్‌వర్డ్ తప్పనిసరి. పాస్‌వర్డ్ విషయంలో ఏమాత్రం.. అలసత్వం వహించినా హ్యాకర్ల వల్ల మన బతుకులు వీధిన పడటం ఖాయం. కానీ.. భారతీయులు ఈ పాస్‌వర్డ్‌ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తాజాగా ఓ నివేదిక స్పష్టం చేసింది. భారతీయుల్లో మెజార్టీ శాతం మంది వాడుతున్న పాస్‌వర్డ్‌లను బయటపెట్టింది. కాగా.. భారతీయులు ఎక్కువగా ఎటువంటి పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నారు అనే అంశానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


భారతీయుల్లో ఎక్కువ మంది తమ సోషల్ మీడియా అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్లు తదితరాలకు ‘123456’ అనే పాస్‌వర్డ్‌ ఉపయోగిస్తాన్నారు అనే వాదన చాలా కాలంగా నడుస్తోంది. అయితే.. ఈ వాదన తప్పని నార్డ్‌పాస్ అనే సంస్థ స్పష్టం చేసింది. భారతీయుల్లో ఎక్కవ మంది.. ‘password’ అనే పదాన్నే తమ అకౌంట్లకు పాస్‌వర్డ్‌గా పెట్టుకున్నారని వెల్లడించింది. అంతేకాకుండా.. 12345, 123456, 123456789, 12345678, india123, 1234567898, 1234567 వంటి వాటిని పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటున్నట్లు తెలిపింది. వీటితోపాటు.. ‘iloveyou’, ‘krishna’, ‘sairam’, ‘omsairam’ వంటి పదాలను దేశంలోని అత్యధిక మంది ప్రజలు తమ పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటున్నట్టు పేర్కొంది. 



ఇటువంటి సులభమైన పదాలను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటే.. హ్యాకర్ల నుంచి ముప్పు తప్పదని హెచ్చరించింది. వీటిని పాస్‌వర్డ్‌గా కలిగిన అకౌంట్లు.. చాలా సులభంగా హ్యాక్ అవుతాయని తెలిపింది. అటువంటి అకౌంట్లను ఒక సెకండ్ కంటే తక్కువ సమయంలోనే హ్యాక్ చేయవచ్చని తెలిపింది. ఎక్కువ మొత్తంలో అకౌంట్లు ఉండి, పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే.. పాస్‌వర్డ్ మేనేజర్స్‌ను ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. సాధ్యమైనంత వరకు పాస్‌వర్డ్‌లో స్పెషల్ క్యారెక్టర్లు, ఆల్ఫాబెటిక్ అక్షరాలు, నెంబర్లు ఉండే విధంగా చూసుకుంటే మేలని తెలిపింది. 


Updated Date - 2021-11-20T00:06:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising