ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షాకింగ్ వీడియో! కదులుతున్న కారులోంచి జారిపోయిన చిన్నారి..! ఆ తరువాత...

ABN, First Publish Date - 2021-03-17T01:33:56+05:30

చిన్నపిల్లలతో కారులో ప్రయాణిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తలపులు అన్ని లాక్ చేసి ఉన్నాయా లేదాఅని ఒకటికి రెండు మార్లు సరిచూసుకోవాలి. లేకపోతే.. చిన్నారుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ఇటువంటి ఏమరపాటు కారణంగా ప్రమాదంలో పడ్డ ఓ చిన్నారికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: చిన్నపిల్లలతో కారులో ప్రయాణిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కారు తలుపులు అన్ని లాక్ చేసి ఉన్నాయా లేదో ఒకటికి రెండు మార్లు సరిచూసుకోవాలి. లేకపోతే.. చిన్నారుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ఇటువంటి ఏమరపాటు కారణంగా ప్రమాదంలో పడ్డ ఓ చిన్నారికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాలుగు రోడ్ల కూడలి వద్ద గ్రీన్ సిగ్నల్ పడటంతో వాహనాలు ముందుకు కదిలాయి. అన్నికంటే ముందుకు వరుసలో ఉన్న కారు కాస్తంత వేగంగా ముందుకు కదిలింది. ఇంతలో ఏమైందో ఏమో కానీ.. కారు వెనుక డొరు ఒక్కసారిగా తెరుచుకుంది. 


దీంతో..వెనుక సీట్లో ఉన్న చిన్నారి కారులోంచి జారి రోడ్డుపై పడిపోయాడు. అదృష్టవశాత్తూ అప్పుడే వాహనాలన్నీ కదలడం ప్రారంభించడంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. దీంతో..వెనుకున్న వాహనదారులు వెంటనే అప్రమత్తమై..ఎక్కడివారు అక్కడే ఆగిపోయారు. అయితే..బిడ్డ జారిపోయిన విషయం గమనించిన తల్లి వెంటనే పరుగుపరుగున వెనక్కు వచ్చి బిడ్డను తీసుకెళ్లింది. తొలుత అంతర్జాతీయ మీడియాలో ప్రచురితమైన ఈ ఉదంతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవడంతో ప్రస్తుతం నెటిజన్లు కూడా షాకైపొతున్నారు. అదృష్టం బాగుండబట్టి సరిపోయింది కానీ.. మరోలా జరిగుంటే ఎంతటి ప్రమాదం సంభవించేదో అంటూ కామెంట్లు పెడుతున్నారు. 



Updated Date - 2021-03-17T01:33:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising