ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతను ఓ మెడికల్ స్టూడెంట్.. ప్రేయసిని సంతోషపెట్టేందుకు తప్పుడు మార్గంలో పయనం.. ప్రస్తుతం అతని పరిస్థితి ఏంటంటే..

ABN, First Publish Date - 2021-12-25T22:54:25+05:30

అతను ఓ మెడికల్ స్టూడెంట్.. ఏడాది క్రితం అతను తన క్లాస్‌మేట్‌తో ప్రేమలో పడ్డాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను ఓ మెడికల్ స్టూడెంట్.. ఏడాది క్రితం అతను తన క్లాస్‌మేట్‌తో ప్రేమలో పడ్డాడు.. ఆమెను ఇంప్రెస్ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసేవాడు.. ఆమెకు ఖరీదైన వస్తువులంటే ఇష్టమని తెలిసి వాటిని గిఫ్ట్స్‌గా ఇచ్చేవాడు.. అయితే ఆ ఖరీదైన బహుమతులను కొనేందుకు స్నేహితుడితో కలిసి తప్పుడు మార్గంలో పయనించాడు.. చివరకు పోలీసులకు దొరికిపోయాడు.. మహారాష్ట్రలోని పుణెలో ఈ ఘటన జరిగింది. 


పుణెలో ఓ మెడికల్ కాలేజీలో ఎంబీబీయస్ మూడో సంవత్సరం చదువుతున్న అనికేత్, తన స్నేహితుడు వైభవ్‌తో కలిసి ప్రముఖ షాపింగ్ మాల్స్‌లో దొంగతనం చేసేవాడు. బంగారు నగలు, ఖరీదైన వస్తువులను స్నేహితులిద్దరూ దోచుకునేవారు. వాటిని అనికేత్ తన ప్రేయసికి బహుమతులుగా అందించేవాడు. మద్యానికి బానిసైన వైభవ్ కొన్ని వస్తువులు అమ్ముకొని ఆల్కహాల్ సేవించేవాడు. గత ఆదివారం వీరిద్దరూ ఓ నగల షాప్‌లో పట్ట పగలే నాలుగు ఉంగరాలను దొంగిలించి బయటకు వెళ్లిపోయారు. 


నగల షాప్ యాజమాన్యం ఉంగరాలు పోయినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. అలాగే ఆ దుకాణం బయట అమర్చిన సెక్యూరిటీ కెమేరా ద్వారా బైక్ నెంబర్ తెలుసుకున్నారు. ఆ నెంబర్ ఆధారంగా అనికేత్‌ను, వైభవ్‌ను అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 ఉంగరాలను, ఒక బైక్‌ను, రూ.2 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 

Updated Date - 2021-12-25T22:54:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising