ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవధులు లేని ఆనందం సొంతం కావాలంటే ఈ మూడు విషయాలు తప్పక గుర్తుపెట్టుకోండి

ABN, First Publish Date - 2021-11-07T17:39:23+05:30

మనిషి ఆనందం కోసమే నిరంతరం పరుగులు పెడుతుంటాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనిషి ఆనందం కోసమే నిరంతరం పరుగులు పెడుతుంటాడు. అయితే నిత్యం ఆనందాన్ని నిలబెట్టుకోవడమనేది అసాధ్యం. మానసిక నిపుణులు తెలిపిన ఈ మూడు విషయాలను గుర్తుంచుకుని, జీవితంలో అమలు చేయడం ద్వారా ఎవరైనాసరే నిరంతరం ఆనందంగా ఉండవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 


గొప్పలకు పోవాలని అనుకోవద్దు:

‘సామాన్య జీవితం.. ఉన్నత ఆలోచనలు’ కలిగి ఉండాలని మేథావులు చెబుతుంటారు. దీనిని అందరూ ఎప్పుడో ఒకప్పుడు వినేవుంటారు. ఈ విషయాన్ని భారతీయ సంస్కృతి ఏనాడో ప్రపంచానికి చాటి చెప్పింది. జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు ఇదే మూల మంత్రం. ఎందుకంటే మీరు సామాన్య జీవితం గడపాలని నిర్ణయించుకున్నప్పుడు గొప్పలకు పోరు. ఇతరులతో పోల్చుకోరు. మీ అవసరాలేమిటో గుర్తెరిగి అందుకు అనుగుణంగా నడుచుకుంటారు. దీనికి విరుద్ధంగా జీవించేవారు కష్టాల పాలవడాన్ని మనం చూస్తూనేవుంటాం. అందుకే మనలోని దుర్గుణాలను విడిచిపెట్టి సింపుల్ లైఫ్ స్టయిల్‌కు అలవాటు పడితే జీవితంలో ఆనందానికి కొరత ఉండదు. 

ఇతరులకు సాయం చేయండి:

నిజమైన ఆనందం ఇతరులకు సాయం చేసినప్పుడే దొరుకుతుందని అంటారు. దీని గురించి బౌద్ధ బిక్షువు జెన్ తాను రాసిన పుస్తకంలో ఇతరులకు సాయం చేయడంతోనే మీలో ప్రసన్నత ప్రారంభమవుతుందని రాశారు. అందుకే మీ దగ్గరకు ఎవరైనా సాయంకోరివస్తే వారికి చేతనైనంత సాయం  చేయండి. అప్పుడు కలిగే ఆనందాన్ని గమనించండి అని జెన్ సూచించారు. 


తిరిగి సాయం ఆశించకండి

సాధారణంగా మనం ఎవరికైనా ఏదైనా సాయం చేస్తే ఎప్పుడో ఒకప్పుడు తిరిగి వారి నుంచి సాయం పొందాలని కోరుకుంటుంటాం. అయితే వారు మనం ఆశించిన విధంగా సాయం చేయకపోతే వారిపై ద్వేషాన్ని పెంచుకుంటాం. మానసిక ప్రశాంతతను కోల్పోతాం. అందుకే సాయం చేసినపుడు తిరిగి ఏదో పొందాలని కోరుకోకుండా ఉండటం వలన ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఏదో ఒక సాయం చేసి, వారు తిరిగి మనకు సాయం చేస్తారని నమ్మకం పెట్టుకోవడం వలన నిరాశ ఎదురుకావచ్చు. అందుకే మనం చేసిన సాయానికి అవతలివారు తిరిగి సాయం అందించాలనే ఆలోచనను మనసులోంచి తీసివేయండి. అప్పుడే మీరు ఆనందంగా ఉండగలుగుతారు. 

Updated Date - 2021-11-07T17:39:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising