ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వామ్మో.. పులికి ఇంత బలం ఉంటుందా..? ఏకంగా వాహనాన్నే..!

ABN, First Publish Date - 2022-01-01T03:02:08+05:30

ప్రస్తుతం సోషల్ మీడియాలో పులికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో ఓ పులి చేసిన పనిని చూసి.. నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ‘వామ్మో.. పులికి ఇంత బలం ఉంటుందా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో పులికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ఓ పులి చేసిన పనిని చూసి.. నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ‘వామ్మో.. పులికి ఇంత బలం ఉంటుందా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా.. నెటిజన్లు అంతలా ఆశ్చర్యపడేలా పడేలా ఆ పులి ఏం చేసిందనేగా మీ సందేహం. మరెందుకు ఆలస్యం వివరాల్లోకి వెళ్దాం పదండి.



తాజాగా కొందరు టూరిస్ట్‌లు బన్నేర్‌ఘట్ నేషనల్ పార్కును సందర్శించేందుకు వెళ్లారు. జైలో వాహనంలో పార్కులో తిరుగుతూ.. అక్కడ కనిపించిన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే పులుల గుంపును చూసి తమ జైలో వాహనాన్ని పక్కన పార్కు చేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో వారి వాహనం వెనకపై నుంచి ఓ పులి వచ్చింది. గట్టిగా గాండ్రిస్తూ.. ఆ వాహనానికి ఉన్న బంపర్‌ను నోటితో బలంగా పట్టుకుని.. కొన్ని మీటర్ల వరకూ వెనకకు లాగింది. దీంతో వాహనంలో ఉన్న పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే మరో వాహనంలో ఉన్న పర్యాటకుడు ఆ దృశ్యాలను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాన్ని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర  ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. 






Updated Date - 2022-01-01T03:02:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising