ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలేజీ ప్రాక్టికల్ పరీక్ష నోట్స్ ఇస్తానని పిలిచి.. ఇద్దరమ్మాయిలతో ముగ్గురు ఏం చేశారంటే..

ABN, First Publish Date - 2021-11-16T15:38:43+05:30

బీహార్‌లోని నవాడా నగరంలో ఇద్దరు అమ్మాయిలపై కాలేజీ ప్రాక్టికల్ పరీక్షకు సంబంధించి నోట్స్ ఇస్తానని పిలిచి ముగ్గురు యువకులు దారుణానికి పాల్పడ్డారు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీహార్‌లోని నవాడా నగరంలో ఇద్దరు అమ్మాయిలపై కాలేజీ ప్రాక్టికల్ పరీక్షకు సంబంధించి నోట్స్ ఇస్తానని పిలిచి ముగ్గురు యువకులు దారుణానికి పాల్పడ్డారు.

నవాడా నగరంలో నివసించే సీమ(పేరు మార్చబడినది) కాలేజీ చదువుకుంటోంది. ఆమె కాలేజీకి ఏదో కారణంగా హాజరుకాలేదు. తనకు త్వరలో జరగబోయే ప్రాక్టికల్ నోట్స్ అవసరమని తన తోటి విద్యార్థి రయాన్‌కు ఫోన్‌లో చెప్పింది. 


దానికి రయాన్ పక్క వీధిలో ఉన్న తన స్నేహితుడు ఆబిద్ ఇంటికి వచ్చి నోట్స్ తీసుకోమని చెప్పాడు. అప్పడే సీమ ఇంటికి తన స్నేహితురాలు రుక్సానా(పేరు మార్చబడినది) వచ్చింది. సీమ రుక్సానాతో కలిసి రయాన్ పిలిచిన ఇంటికి వెళ్లింది. అక్కడ సీమ, రుక్సానా వెళ్లేసరికి రయాన్‌తోపాటు ఆబిద్, ముస్తఫా అనే మరో ఇద్దరు యువకులు ఉన్నారు. వీరిలో రయాన్ మైనర్. 


సీమ, రుక్సానాని తీసుకొని రయాన్ ఒక గదిలోకి వెళ్లాడు. వెనుకనుంచే ముస్తఫా, ఆబిద్ లోపలికి వచ్చి గదికి తాళం వేశారు. ఆబిద్, ముస్తఫా ఇద్దరూ కలిసి ఆ ఇద్దరమ్మాయిలపై అత్యాచారం చేశారు. ఆ తరువాత అమ్మాయిలను ఈ విషయం బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. 


కానీ రుక్సానా మాత్రం తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సీమ వాంగ్మూలం కూడా తీసుకొని రయన్, ఆబిద్‌ను అరెస్టు చేశారు. మరో నిందితుడు ముస్తఫా పరారీలో ఉన్నాడు. సీమ, రుక్సానాలను పోలీసులు ఆస్పత్రిలో పరీక్ష చేయించి అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ చేశారు. ప్రస్తుతం ఆబిద్, రయాన్‌లను కోర్టు రిమాండ్‌కు పంపించింది.

Updated Date - 2021-11-16T15:38:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising