ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దూసుకొస్తున్న ఆస్టరాయిడ్లు..భూమికీ వాటికీ ఎంత గ్యాప్ ఉందంటే..

ABN, First Publish Date - 2021-10-19T23:40:30+05:30

రాబోయే వారాల్లో అంతరిక్షంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. మూడు గ్రహశకలాలు భూమికి అత్యంత సమీపంలో నుంచి దూసుకుపోనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: రాబోయే వారాల్లో అంతరిక్షంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. మూడు గ్రహశకలాలు భూమికి అత్యంత సమీపంలో నుంచి దూసుకుపోనున్నాయి. అందులో ఒకటి ఏకంగా ఈజిప్ట్ పిరమిడ్ అంత భారీ పరిమాణంలో ఉంటుంది. దీనిని శాస్త్రవేత్తలు ఆస్టరాయిడ్ 2021 ఎస్‌ఎమ్3 అని పిలుస్తున్నారు. దీని చుట్టుకొలత 525 అడుగులు ఉంటుందట. ఈ ఆస్టరాయిడ్ ప్రయాణ వేగాన్ని, మార్గాన్ని లెక్కకట్టిన శాస్త్రవేత్తల.. ఇది భూమికి 3.5 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లిపోతుందని అంచనా వేశారు. 


ఆ మరుసటి రోజే మరో చిట్టి గ్రహశకలం కూడా భూమికి సమీపం నుంచి ప్రయాణించనుంది. దీని పేరు ఆస్టరాయిడ్ 2021 టీజే15 కాగా.. చుట్టుకొలతేమో 5.6 మీటర్లు. ఇది భూగ్రహానికి దాదాపు 238,854 మైళ్ల దూరం నుంచి దూసుకుపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేసారు. ఇక నవంబర్‌లో .. ఆస్టరాయిడ్ 2004 యూఈ అనే గ్రహశకలం భూమికి సుమారు 2.6 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లిపోతుంది. మూడింటిల్లోకీ ఇదే అతి పెద్ద ఆస్టరాయిడ్ అని శాస్త్రవేత్తలు తెలిపారు. మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే.. భూమి, చెంద్రుడికి మధ్య ఉన్న దూరానికి ఇది 11 రెట్లు ఎక్కువ. 1246 అడుగులు పొడవుండే ఈ ఆస్టరాయిడ్.. చూడటానికి అమెరికాలోని ఎంపైర్ స్టేట్ భవనం అంత పెద్దదిగా ఉంటుంది. 


అయితే..ఈ మూడింటి వల్ల భూమికి ఎటువంటి ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. సువిశాల విశ్వంలో 2 మిలియన్ మైళ్లు అంటే చాలా తక్కువని, మనుషులకు ఇది చాలా పెద్దదిగా అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ గ్రహశకలాలను నిరంతరంగా అధ్యయం చేస్తున్న నాసా శాస్త్రవేత్త పాల్ వీటి గురించి మాట్లాడుతూ.. ‘‘ మేం ఆస్టరాయిడ్లను దాదాపు 20 ఏళ్లుగా గమనిస్తున్నాం. ఇప్పటి వరకూ చాలా చిన్నగా ఉండే నాలుగు గ్రహశకలాలు మాత్రమే మన వాతావరణంలోకి ప్రవేశించాయి. ఆ తరువాత అగ్నిగోళాల్లా మారిపోయాయి. కొన్ని గాల్లోనే బూడిదైపోగా.. ఓ రెండు మాత్రం భూమిని తాకాయి. ఇవి ఎక్కడ పడతాయో ముందుగానే అంచనా వేశాం.. మా అంచనాలన్నీ నిజమయ్యాయి.’’ అని ఆయన అన్నారు. 

Updated Date - 2021-10-19T23:40:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising