ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిన్నటి దాకా స్వీపర్‌గా పనిచేసిన ఈమె.. ఇప్పుడు ఏ పొజిషన్‌లో ఉందో తెలిస్తే..

ABN, First Publish Date - 2021-07-16T00:45:39+05:30

‘‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బులెట్ దిగిందా? లేదా?’’ అంటూ ఒక సినిమాలో మహేష్ బాబు అంటారు. అదే సినిమాలో అప్పటి వరకూ ఆవారాలా కనిపించిన హీరో ఐపీఎస్ ఆఫీసర్ అని తెలిసి మనం ఎంత ఆశ్చర్యపోయామో కదా. సినిమాల్లో ఇలాంటి ట్విస్టులకు స్ఫూర్తినిచ్చేది ఆశా కందారా వంటి వ్యక్తులే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ‘‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బులెట్ దిగిందా? లేదా?’’ అంటూ ఒక సినిమాలో మహేష్ బాబు అంటారు. అదే సినిమాలో అప్పటి వరకూ ఆవారాలా కనిపించిన హీరో ఐపీఎస్ ఆఫీసర్ అని తెలిసి మనం ఎంత ఆశ్చర్యపోయామో కదా. సినిమాల్లో ఇలాంటి ట్విస్టులకు స్ఫూర్తినిచ్చేది ఆశా కందారా వంటి వ్యక్తులే. ఆమె రాజస్థాన్‌లో నిన్నమొన్నటి వరకూ ప్రతిరోజూ వచ్చి రోడ్లు ఊడ్చిన స్వీపర్. ఇప్పుడు ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. కారు, మంచి జీతం, సమాజంలో గౌరవం అన్నీ ఆమె చెంతకు చేరాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఆశా నివశిస్తున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా. ఎనిమిదేళ్ల క్రితం భర్తతో విడిపోయింది. అప్పటి నుంచి పిల్లల భారం కూడా ఆమెపైనే పడింది. ఇద్దరినీ చదివించడం కోసం తానే తిప్పలు పడసాగింది.



ఈ క్రమంలోనే ఆమె రోడ్లు ఊడ్చే మున్సిపాలిటీ ఉద్యోగంలో చేరారు. ఆ ఉద్యోగం చేస్తుండగా ప్రభుత్వ ఉద్యోగులను దగ్గరగా చూసిన తర్వాత, తాను కూడా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే కోరిక ఆమెకు కలిగింది. దీంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఆ వెంటనే ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదవడం ప్రారంభించింది. ఆర్ఏఎస్-2018 పరీక్షలు రాసింది. అయితే కరోనా కారణంగా ఈ పరీక్షల ఫలితాలు ఆలస్యంగా వచ్చాయి. తాజాగా వెలువడిన ఈ ఫలితాల్లో ఆశా.. 728వ ర్యాంకు సాధించారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఈ ఫలితాలు రావడానికి సరిగ్గా 12 రోజుల క్రితమే స్వీపర్‌గా ఆమె ఉద్యోగం పర్మినెంట్ అయింది. ఆర్ఏఎస్ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు విభాగాల్లోనూ ఆమె ఉత్తీర్ణత సాధించారు. పట్టుదల ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చనే నానుడిని ఆశా మరోసారి నిరూపించారని స్థానికులు అంటున్నారు. ఆమె విజయం పట్ల హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - 2021-07-16T00:45:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising