ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమలో పడినవారు ఏం చేయాలి? ఏం చేయకూడదు? నిపుణులేమంటున్నారు?

ABN, First Publish Date - 2021-12-28T17:08:17+05:30

ప్రేమలో పడితే మరో లోకం కనిపించదంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమలో పడితే మరో లోకం కనిపించదంటారు. అయితే ప్రేమలోపడిన ప్రేమికులు అన్ని పరిస్థితులలో తెలివిగా మెలిగితేనే వారి అనుబంధం బలపడుతుంది. సాధారణంగా మహిళలు అధికంగా బావోద్వేగాలను కలిగివుంటారు. అందుకే వారు ప్రేమలో పడినప్పుడు మరింత బ్యాలెన్స్‌డ్ గా ఉండాలని మానసిక నిపుణులు చెబుతుంటారు. ప్రేమలో పడిన యువతులు ఎడ్జెస్ట్‌మెంట్, కాంప్రమైజ్‌కు మధ్య గల తేడాను తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిని గ్రహించినప్పుడే ప్రేమికుల మధ్య నిజమైన అనుబంధం ఏర్పడుతుంది.


మార్పు కోసం ఆలోచించండి

ప్రేమలో పడిన తరువాత అవతలి వ్యక్తి కోసం పూర్తిగా మారాల్సివస్తే అటువంటి అనుబంధాన్ని వదులుకోవడమే ఉత్తమం. నిజానికి ప్రేమలో పడినవారు అవతలి వ్యక్తి కోసం కొంతవరకూ మారాల్సివుంటుంది. అయితే ఇది ఇద్దరికీ ఇబ్బందికాని రీతిలో ఉండాలి. అంతేగానే హద్దులు దాటి మారాల్సి వస్తే తరువాత ఇబ్బందులు తలెత్తుతాయి. ఒకవేళ మీకు కోఫం ఎక్కువగా వస్తుందనుకోండి.. దానిని మీ రిలేషన్‌షిప్ కోసమో లేదా మీకోసమైనా కోపాన్ని నియంత్రించుకోవాలి. ఈ విధమైన మార్పు పరస్పర గౌరవాన్ని పెంచుతుంది. 

స్వేచ్ఛను కోల్పోవద్దు

ప్రేమలో పడ్డాక ఇద్దరు భాగస్వాములు తమ స్వేచ్ఛను కోల్పోకూడదు. అవసరమైన అన్ని విషయాలలోనూ పరస్పరం అభిప్రాయాలను పంచుకోవాలి. ఇటువంటి సందర్భంలో మొండిగా తన మాటే నెగ్గాలని ఎవరు పంతం పట్టినా ఆ అనుబంధం దీర్ఘకాలం కొనసాగదని ఇద్దరూ గ్రహించాలి. 


వర్క్ షెడ్యూల్ విషయంలో..

ప్రేమికులిద్దరూ ఉద్యోగస్తులైతే వర్క్ షెడ్యూల్‌ను మ్యానేజ్ చేసుకోవాలి. ఉద్యోగాల కారణంగా పర్సనల్ లైఫ్‌లో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. అప్పుడే వారి కెరియర్ అభివృద్ధి దిశగా ముందుకు సాగడంతోపాటు వారి మున్ముందు వైవాహిక జీవితం కూడా ఆనందంగా సాగుతుంది. 

ఇంప్రెస్‌కు మించి..

మీరు నిజంగా స్ట్రాంగ్ ఉమెన్ అయితే ఎవరైనా మిమ్మల్ని ఇంప్రెస్ చేయబోతే ఇట్టే గ్రహించగలుగుతారు. అయితే ప్రేమలో పడినప్పుడు ఇంప్రెస్ చేయడమొక్కటే సరిపోదు. అవతలి వ్యక్తి కోసం, మంచి అనుబంధం కోసం మారాల్సివుంటుంది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ప్రేమికుల మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. 

Updated Date - 2021-12-28T17:08:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising