ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్యాంక్‌పై కూర్చుని మరీ ప్రేయసి హగ్గులు.. డబుల్ జోష్‌తో ప్రియుడి బైక్‌ డ్రైవ్.. చివరకు సీన్ రివర్స్..!

ABN, First Publish Date - 2021-08-03T17:37:57+05:30

పాపం.. వారిద్దరూ సినిమాల్లోలా నిజంగా స్టంట్లు చేద్దామనుకున్నారు.. బైక్‌పైనే రొమాన్స్ చేయబోయారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాపం.. వారిద్దరూ సినిమాల్లోలా నిజంగా స్టంట్లు చేద్దామనుకున్నారు.. బైక్‌పైనే రొమాన్స్ చేయబోయారు.. ప్రియుడు బైక్ నడపుతుండగా ప్రేయసి ట్యాంక్ మీద కూర్చుంది.. అతడి వైపు తిరిగి కూర్చుని హగ్గులు, ముద్దులు ఇస్తోంది.. దీంతో డబుల్ జోష్‌తో ప్రియుడు బైక్ నడుపుతున్నాడు.. ఇంతలో ఓ ఆటోలో కొంత మందిని వారిని ఛేజ్ చేసి పట్టుకున్నారు.. వారికి బుద్ధి చెప్పి ముందుకు పంపారు.. బీహార్‌లోని గయా జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


గయ జిల్లాలోని గ్రామీణ రోడ్లపై ఓ జంట సోమవారం హల్‌చల్ చేసింది. సినిమాల్లోని హీరోహీరోయిన్ల తరహాలో రొమాంటిక్ బ్రైక్ డ్రైవ్ చేసింది. ప్రియుడు బైక్ నడుపుతుండగా ప్రేయసి ట్యాంక్‌పై అతడికి అభిముఖంగా కూర్చుని రొమాన్స్ పండించింది. ప్రేయసి నుంచి ముద్దులు, హగ్గులు అందుకుంటూనే ప్రియుడు వేగంగా బండి నడుపుతున్నాడు. అయితే రోడ్లపై ఈ జంట చేష్టలను చూసి ఆగ్రహంచిన కొందరు గ్రామస్తులు ఆటోలో వారిని ఛేజ్ చేసి పట్టుకున్నారు.  


రోడ్లపై అలాంటి పనులు చేయకూడదని హెచ్చరించారు. మీకు, మీకు ఎదురుగా వచ్చేవారికి ప్రాణాపాయం తప్పదని చెప్పారు. కొందరు వారి చేష్టలను వీడియో తీయడం ప్రారంభించారు. దీంతో ఆ జంట బుద్ధి తెచ్చుకుని వారికి క్షమాపణ చెప్పి ముందుకు కదిలింది. 

Updated Date - 2021-08-03T17:37:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising