ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ మహిళ బ్యాంకులో సీనియర్ మేనేజర్.. భర్త కూడా బ్యాంకు ఉద్యోగే.. సంతోషంగా ఉండాల్సిన ఆమె ఆత్మహత్య వెనుక..

ABN, First Publish Date - 2021-09-13T17:04:06+05:30

పై ఫొటోలో కనిపిస్తున్న మహిళ బ్యాంక్ ఆఫ్ బరోడాలో సీనియర్ మేనేజర్‌.. ఆమె భర్త కూడా బ్యాంకు ఉద్యోగే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పై ఫొటోలో కనిపిస్తున్న మహిళ బ్యాంక్ ఆఫ్ బరోడాలో సీనియర్ మేనేజర్‌.. ఆమె భర్త కూడా బ్యాంకు ఉద్యోగే.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. ఆర్థికంగా, సామాజికంగా ఉన్నతమైన స్థానం.. అయితే తాజాగా ఆమె తన పిల్లల గురించి కూడా ఆలోచించకుండా స్వంత ఫ్లాట్‌లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.. భర్త వ్యసనాల కారణంగానే ఆమె అంత ఘోరానికి పాల్పడినట్టు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. హర్యానాలోని రేవారి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


జార్ఖండ్‌లోని రాంచీలో నివసిస్తున్న శిల్పి సోనమ్.. అక్కడి బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త రాకేశ్ శర్మ హర్యానాలోని జజ్జర్ జిల్లాలో హర్యానా గ్రామీణ బ్యాంకు ఉద్యోగి. జూన్ 6, 2014న వీరిద్దరికీ వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల కుమారుడు, ఎనిమిది నెలల కూతురు ఉన్నారు. శిల్పి పిల్లలతో కలిసి రాంచీలో నివసిస్తుండగా.. రాకేశ్ ఉద్యోగ నిమిత్తం హర్యానాలో ఉంటున్నాడు. సెలవు వచ్చినపుడు రాంచీ వస్తుంటాడు. హర్యానాలో భర్త ఉంటున్న ఫ్లాట్‌కు శనివారం వెళ్లిన శిల్పి అక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాకేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.   


ఇవి కూడా చదవండి

అర్జెంట్‌గా ఫోన్ చేసుకోవాలి.. ప్లీజ్.. అంటూ మార్కెట్లో ఓ కుర్రాడు అడగడంతో సరేనని మొబైల్ ఇచ్చాడో వ్యక్తి.. చివరకు..





షాపులో కౌంటర్‌పైకి సడన్‌గా దూకిన ఆరు అడుగుల పాము.. ఆ కుర్రాడి వెన్నులో వణుకు..


కాగా, పెళ్లికి ముందు నుంచే రాకేశ్‌కు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, తరచుగా మద్యం కూడా సేవిస్తుంటాడని శిల్పి సోదరి దీపక్ పోలీసులకు చెప్పాడు. భర్తకు ఉన్న వ్యసనాల కారణంగా తరచుగా అతడితో తన సోదరి గొడవపడేదని దీపక్ తెలిపాడు. దీంతో తన సోదరిని రాకేశ్ వేధింపులకు గురి చేసేవాడని, మద్యం సేవించి వచ్చి కొట్టేవాడని పోలీసులకు చెప్పాడు. శనివారం భర్త ఫ్లాట్‌కు వెళ్లిన శిల్పి అక్కడి దృశ్యాలను చూసి షాకైందని, దాంతో భర్తతో గొడవపడిందని తెలిపాడు. భర్త కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తన సోదరి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని దీపక్ చెప్పాడు. 

Updated Date - 2021-09-13T17:04:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising