ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలా జరుగుతుందని ఆమె కలలో కూడా ఊహించలేదు.. చిన్న పొరపాటే కొంపముంచింది..

ABN, First Publish Date - 2021-09-30T18:14:04+05:30

దేశంలో అక్కడక్కడా జరుగుతున్న సంఘటనల గురించి.. పేపర్ ద్వారానో లేక ఇరుగురు పొరుగు వారి వల్లనో ఆమెకు తెలుస్తూనే ఉన్నాయి. అయితే తాను కూడా అటువంటి సంఘటనలను ఎదుర్కొంటానని ఆమె కలలో కూడా ఊహించలేదు. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుందని అస్స

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో అక్కడక్కడా జరుగుతున్న సంఘటనల గురించి.. పేపర్ ద్వారానో లేక ఇరుగురు పొరుగు వారి వల్లనో ఆమెకు తెలుస్తూనే ఉన్నాయి. అయితే తాను కూడా అటువంటి సంఘటనలను ఎదుర్కొంటానని ఆమె కలలో కూడా ఊహించలేదు. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. దీనంతటికీ ఆమె చేసిన చిన్న పొరపాటే కారణం. తెలిసిన వాళ్లే కదా అని నమ్మి వెంట వెళ్లడమే.. ఆమె చేసిన తప్పు. ఇంతకూ ఏం జరిగిందంటే..


హర్యానాలోని బావల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ.. కొద్ది రోజుల క్రితం తన బంధువుల ఇంటికి వెళ్లింది. అనంతరం తన స్వగ్రామానికి బయల్దేరింది. బానిపూర్ చౌక్ వద్ద బస్సు దిగిన ఆమె.. తన స్వగ్రామానికి వెళ్లేందుకు ఆటో కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు యువకులు వచ్చి.. ఆమె వద్ద కారు ఆపారు. అనంతరం ఆటోలు వచ్చేలా లేవు.. మేము కూడా ఇంటికే వెళ్తున్నాం.. నిన్ను కూడా డ్రాం చేస్తాం కారెక్కు అంటూ ఆ మహిళను కోరారు. ఆ యువకులు తన ఇంటి పక్క వారే కావడంతో.. ఆమె వారిని నమ్మి కారెక్కింది. దారి మధ్యలో ఆ యువకులు సదరు మహిళకు తాగు నీరిచ్చారు. వాటిని తాగిన కొద్ది సేపటికే ఆమె స్పృహ కోల్పోయింది. మెలుకువ వచ్చే సరికి.. అడవిలోని ఓ పాడుబడ్డ ఇంట్లో పడి ఉంది. 



ఈ క్రమంలో తనపై జరిగిన అఘాయిత్యాన్ని గుర్తించిన ఆమె.. బోరున విలపించింది. దీంతో అక్కడకు చేరిన యువకులు.. అత్యాచారం చేస్తూ ఆ దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించినట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా ఈ విషయాన్ని బయటపెడితే.. ఆ వీడియోను వైరల్ చేస్తా మంటూ బెదిరించారు. దీంతో తనపై జరిగిన ఘాతుకాన్ని ఆమె బయటపెట్టలేదు. ఇది జరిగి నెల రోజులు గడిచిన తర్వాత.. ఆ యువకులు మళ్లీ బెదిరింపులకు పాల్పడ్డారు. వాళ్లు పెట్టే వేధింపులను తట్టుకోలేక.. సదరు మహిళ జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు.. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ యువకులను అరెస్టు చేసి, కటకటాల వెనక్కి నెట్టారు. 


Updated Date - 2021-09-30T18:14:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising