ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూతురు కోరిందని హోటల్‌కు వెళ్లి చికెన్ గ్రేవీని తీసుకొచ్చిందా తల్లి.. తిన్నాక ఏదోలా ఉంటే కూల్ డ్రింక్ తాగారు.. ఆ తర్వాత..

ABN, First Publish Date - 2021-10-15T02:42:09+05:30

కూతురు కోరిందని హోటల్‌కు వెళ్లి చికెన్, పరోటా తీసుకొచ్చిందా తల్లి.. భర్త, కుమారుడితో కలిసి సరదాగా భోజనం చేశారు. అయితే భార్య, కుమార్తెకు అజీర్తిగా ఉండడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో చిన్న సంఘటన పెను విషాదాన్ని నింపింది. కూతురు కోరిందని హోటల్‌కు వెళ్లి చికెన్, పరోటా తీసుకొచ్చిందా తల్లి.. భర్త, కుమారుడితో కలిసి సరదాగా భోజనం చేశారు. అయితే భార్య, కుమార్తెకు అజీర్తిగా ఉండడంతో బయటికి వెళ్లి కూల్‌డ్రింక్స్ తీసుకొచ్చాడు. తల్లీకూతుళ్లు ఇద్దరూ శీతలపానీయాన్ని తీసుకున్నారు. కానీ తర్వాత వారి కుటుంబంలో విషాదం అలుముకుంటుందని ఎవరూ ఊహించలేదు. చెన్నైలో జరిగిన ఈ హృదయ విదారక సంఘటన వివరాల్లోకి వెళితే.. 


 చెన్నై తూత్తుకుడి జిల్లా కోవిల్‌ పట్టిలోని తంగప్ప నగర్‌కు చెందిన కర్పగం(30)కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె కోరిక మేరకు.. బుధవారం మధ్యాహ్నం సమీపంలోని హోటల్‌కు వెళ్లి చికెన్, పరోటా తెచ్చుకున్నారు. కుటుంబమంతా కలిసి భోజనం చేశారు. అయితే కుమార్తె దర్శిని(4), భార్యకు అజీర్తిగా ఉండడంతో.. కర్పగం వెళ్లి శీతలపానీయాలు తీసుకొచ్చాడు. తల్లీకూతుళ్లు ఇద్దరూ దాన్ని తాగారు. అది తాగిన కొద్దిసేపటికి వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే మృతి చెందారు.


 సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. హోటల్‌ను తనిఖీ చేసి, ఆహార పదార్థాల శాంపిల్స్‌ సేకరించామని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వస్తే మృతికి గల కారణాలు తెలుస్తాయని చెప్పారు. అయితే శీతలపానీయం తీసుకునే సమయంలో వారి కుమారుడు, కర్పగం నిరాకరించడంతో క్షేమంగా ఉన్నారు. దీంతో కూల్‌డ్రింక్ కారణంగానే తల్లీకుమార్తె మృతి చెందారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటిదాకా బాగున్న ఇద్దరూ.. ఒక్కసారిగా చనిపోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకున్నారు.

Updated Date - 2021-10-15T02:42:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising