ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేను కొత్త అమ్మతో ఎందుకు ఉండాలి? ఆమె నాకు నచ్చలేదు.. చిల్డ్రన్స్ కమిషన్‌కు ఓ బాలుడి లేఖ!

ABN, First Publish Date - 2021-12-18T20:56:43+05:30

ఆ భార్యాభర్తలిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇద్దరు కొడుకులను ఇద్దరూ పంచుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ భార్యాభర్తలిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇద్దరు కొడుకులను చెరొకరు పంచుకున్నారు. ఒక కొడుకును తనతో పాటు తీసుకెళ్లిన తండ్రి కొన్ని రోజులకు మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆ బాలుడు ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాడు. తన బాధలను వివరిస్తూ చిల్డ్రన్స్ కమిషన్‌కు ఓ లేఖ రాశాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. 


`మా అమ్మ, నాన్న విడాకులు తీసుకున్నారు. నన్ను మా నాన్నతో పంపించారు. ఇప్పుడు మా ఇంటికి మరో మహిళ వచ్చింది. ఆమెను `అమ్మా` అని పిలవమంటున్నారు. మా అమ్మ బతికే ఉండగా..  నేను వేరే మహిళను ఎందుకు `అమ్మా` అని పిలవాలి. ఆ కొత్త అమ్మతో నేనెందుకు ఉండాలి? విడిపోయేటపుడు నేను ఏమనుకుంటున్నానని నన్ను ఎవరూ అడగలేదు. నేను మా అమ్మతోనే ఉండాలనుకుంటున్నా. నాకు న్యాయం చేయండ`ని ఆ బాలుడు పేర్కొన్నాడు. ఈ కేసులో తల్లిదండ్రులిద్దరినీ కౌన్సిలింగ్‌కు పిలిచినట్టు చిల్డ్రన్స్ కమిషన్‌ మెంబర్ బ్రజేష్ చౌహాన్ తెలిపారు. 

Updated Date - 2021-12-18T20:56:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising