కూతురు పుట్టిందనే సంతోషంతో సెలూన్ యజమాని ఉచితంగా క్షవరం
ABN, First Publish Date - 2021-01-05T16:15:18+05:30
మగబిడ్డ పుట్టాలనుకునే దంపతులున్న నేటి సమాజంలో ఆడపిల్ల జన్మించిందని సంతోషంతో ఉచిత సేవలకు శ్రీకారం...
గ్వాలియర్ (మధ్యప్రదేశ్): మగబిడ్డ పుట్టాలనుకునే దంపతులున్న నేటి సమాజంలో ఆడపిల్ల జన్మించిందని సంతోషంతో ఉచిత సేవలకు శ్రీకారం చుట్టిన హెయిర్ కటింగ్ సెలూన్ యజమాని ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలో వెలుగుచూసింది. గ్వాలియర్ నగరానికి చెందిన సల్మాన్ మూడు హెయిర్ కటింగ్ సెలూన్లకు యజమాని. ఇతనికి జనవరి 4వతేదీన ఆడపిల్ల పుట్టింది. తనకు ఆడపిల్ల పుట్టిందనే సంతోషంతో తనకున్న మూడు సెలూన్లలో ఉచితంగా సేవలు అందించారు.
ఆడపిల్ల పుట్టిందని ఎవరూ దుఖ్ఖించకూడదని, సంతోషంగా ఉండాలనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తాను తన మూడు సెలూన్లలో ఒకరోజు ఉచితంగా సేవలు అందించానని సల్మాన్ చెప్పారు. ఆడపిల్ల భారం కాదని, తనకు అమ్మాయి పుట్టడాన్ని వేడుక చేసుకున్నానని సల్మాన్ చెప్పారు. ఆడపిల్ల పుట్టిందనే సంతోషంతో ఉచిత సేవలు అందించిన సల్మాన్ ను ప్రజలు మెచ్చుకున్నారు.
Updated Date - 2021-01-05T16:15:18+05:30 IST