ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊరికి దూరంగా పొలాల్లో కట్టిన ఈ చిన్న గదిలో ఏం జరుగుతోందో తెలిసి అవాక్కైన పోలీసులు

ABN, First Publish Date - 2021-07-09T22:47:56+05:30

అది జాతీయ రహదారి నెంబర్ 9. హరియాణాలోని ఈ రహదారిపై భజరంగ్ బలి దాభా ఉంది. దాని వెనుక రోడ్డుకు దూరంగా పొలాల్లో ఒక చిన్న గది నిర్మించి ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆ ఊరికి దూరంగా.. పొలాల్లో ఒక చిన్న గది ఉంది. దానిలో ఏం జరుగుతుందో ఊళ్లో ఎవరికీ తెలియదు. కానీ ఈ గదిపై పోలీసులు రెయిడ్ చేశారు. అక్కడ వారికి కనిపించిన దృశ్యం వాళ్లకు పెద్ద షాకిచ్చింది. హరియాణాలోని ఈ జాతీయ రహదారి నెంబర్ 9లో భజరంగ్ బలి దాభా ఉంది. దాని వెనుక రోడ్డుకు దూరంగా పొలాల్లో నిర్మించారీ గది. అక్కడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అయితే తాజాగా ఈ గదిపై సీఎం ఫ్లైయింగ్ స్క్వాడ్ రెయిడ్ చేసింది. అక్కడ వారికి కనిపించిన దృశ్యం చూసి అధికారులు షాకైపోయారు. ఎందుకంటే వారికి అక్కడ 41 గ్యాస్ సిలిండర్లు దొరికాయి. అక్రమంగా ఇన్ని సిలిండర్లను నిల్వ చేయడం నేరం. అసలు ఈ గది నిర్మించిన వారికి ఇన్ని సిలిండర్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ సిలిండర్లు చుట్టుపక్కల ఉన్న దాభాల యజమానులవా? లేక వేరే దగ్గర నుంచి తీసుకొచ్చారా? అని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ ముఠా.. హిసార్ ప్లాంట్‌కు వెళ్లే గ్యాస్ ట్యాంకర్ డ్రైవర్లతో ఒప్పందం చేసుకుందని తెలుస్తోంది. ప్లాంట్ నుంచి బయటకు వచ్చే ట్యాంకర్ల డ్రైవర్లకు డబ్బు ఆశచూపి, తమ సిలిండర్లను వీళ్లు నింపుకునే వారు. వీటిని బయట అమ్ముకునే వారు. అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో 40 సిలిండర్లు కమర్షియల్ సిలిండర్లుకాగా, ఒకటి ఇళ్లలో వాడుకునే డొమెస్టిక్ సిలిండర్. ఇవన్నీ ఇండేన్ గ్యాస్ కంపెనీకి చెందినవేనని అధికారులు తెలిపారు. రెయిడ్ సమయంలో ఈ ముఠాకు చెందిన కొందరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ట్యాంకర్ల నుంచి ఇలా  సిలిండర్లను నింపుకొని, వాటిని మార్కెట్లో అమ్ముకోవడం ఈ ముఠా చేస్తున్న పని అని దర్యాప్తులో తేలింది. ఇప్పటికి రెండుసార్లు సీఎం ఫ్లైయింగ్ స్క్వాడ్ ఈ పొలంలోని గదిపై రెయిడ్ చేసింది. కానీ ఈ ముఠా చాకచక్యంగా తప్పించుకుంది. ఈ క్రమంలో బుధవారం నాడు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించడంతో ముఠా మొత్తం అడ్డంగా దొరికిపోయింది.

Updated Date - 2021-07-09T22:47:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising