ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్య కొడుతుందన్న భయంతో ఆ తాగుబోతు భర్త అర్ధరాత్రి ఒక్క అబద్ధంతో పోలీసులకు ముప్పతిప్పలు.. అసలు కథేంటంటే..

ABN, First Publish Date - 2021-12-05T00:03:03+05:30

భార్య అంటే భయంతో కొందరు మందు తాగాలంటేనే భయపడతారు. నాగ్‌పూర్‌లో ఇలాగే జరిగింది. మందు తాగి ఇంటికెళ్తే భార్య కొడుతుందనే భయంతో.. ఓ మందుబాబు..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంసారం అంటే భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడూ సమస్యలు వస్తూ ఉంటాయి. ఎవరో ఒకరు సర్దుకోవడం, మళ్లీ యథావిదిగా సంసారం చేసుకోవడం సాధారణంగా జరుగుతుంటుంది. అయితే భర్త తాగుబోతు అయితే.. ఇక ఆ ఇల్లు నిత్యం గొడవలకు కేంద్రంగా మారుతుంది. ఏదో ఒక సాకు చూపి భర్త చిత్రహింసలు పెడుతుండడం, భార్య పుట్టింటికి వెళ్లడం, పంచాయితీలు చేసి మళ్లీ పంపించడం.. ఇలా జరగడం చూస్తూనే ఉంటాం. అయితే కొన్ని కుటుంబాల్లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. భార్య అంటే భయంతో కొందరు మందు తాగాలంటేనే భయపడతారు. నాగ్‌పూర్‌లో ఇలాగే జరిగింది. మందు తాగి ఇంటికెళ్తే భార్య కొడుతుందనే భయంతో.. ఓ మందుబాబు ఆడిన ఒక అబద్దంతో పోలీసులకు చుక్కలు కనపడ్డాయి. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో గజేంద్ర ఖోరే(26) అనే వ్యక్తి.. భార్య సురేఖతో కలిసి నివాసం ఉంటున్నాడు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. చాలీచాలని కూలి డబ్బులతో ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో నాగపూర్‌లో అతడికి పని దొరకడంతో భార్యతో సహా వెళ్లాడు. గజేంద్రకు మద్యం తీసుకునే అలవాటు ఉంది. అయితే భార్య అంటే భయం ఉండడంతో ఎక్కువగా తాగేవాడు కాదు. గత మంగళవారం బయట పని ఉండడంతో వెళ్లాడు. అయితే రోజూ మాదిరి కాకుండా ఈసారి ఫుల్‌గా తాగాడు. రాత్రవుతున్నా తాగుతూనే ఉన్నాడు. తర్వాత భార్య గుర్తుకు వచ్చింది. ఇలా తాగి వెళ్తే భార్య కొడుతుందని భయపడ్డాడు. దీంతో భార్యకు ఫోన్ చేసి.. తనను ఎవరో కిడ్నాప్ చేశారని, బాగా కొట్టడంతో ఇంటికి రాలేకున్నానని చెప్పి ఫోన్ ఆఫ్ చేశాడు. తర్వాత ఎన్నిసార్లు చేసినా స్విచ్చాఫ్ వస్తుండడంతో అతడి భార్య కంగారు పడి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెతకడం ప్రారంభించారు.


గజేంద్ర ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సుమారు 600మంది పోలీసులు వెతుకుతున్నారు. అయితే ఈ క్రమంలో గజేంద్ర.. తన స్నేహితుడికి ఫోన్ చేసి, భార్యకు చెప్పిన విషయమంతా తెలియజేశాడు. భర్త రాలేదనే భార్య బాధను చూడలేక.. గజేంద్ర స్నేహితుడు విషయం మొత్తం బయటపెట్టాడు. అసలు నిజం తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. మరుసటి రోజు ఇంటికొచ్చిన గంజేంద్రను స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి పంపించారు. మొత్తానికి తనకు దెబ్బలు తప్పడంతో గజేంద్ర ఊపిరి పీల్చుకున్నాడు.

Updated Date - 2021-12-05T00:03:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising