ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్కులో వాకింగ్ చేస్తున్న వ్యక్తి.. చెట్ల పొదల్లో పడివున్న పెద్ద రాయి.. తీరా ఇంటికి తీసుకెళ్లి చూస్తే..

ABN, First Publish Date - 2021-11-28T02:50:49+05:30

ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తి నక్క తోక తొక్కి వచ్చినట్లున్నాడు. పొద్దునే పార్కులో వాకింగ్ చేస్తుండగా.. చెట్ల పొదల్లో పెద్ద రాయి కనిపించింది. దాన్ని ఇంటికి తీసుకెళ్లాక..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతుంటాయనేది సామెత. బాగా డబ్బున్న వారు కూడా ఒక్కోసారి అష్టదరిద్రులుగా మారుతుంటారు. అలాగే కటిక పేదరికం అనుభవించే వారు.. ఉన్నట్టుండి ధనవంతులు అయిపోతుండడం మనం చూస్తూనే ఉంటాం. అలాంటి వారిని చూసినప్పుడు.. వీడు నక్క తోక తొక్కి వచ్చాడురా.. అంటూ ఉంటాం. ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తి.. ఇలాగే నక్క తోక తొక్కి వచ్చినట్లున్నాడు. పొద్దునే పార్కులో వాకింగ్ చేస్తుండగా.. చెట్ల పొదల్లో పెద్ద రాయి కనిపించింది. దాన్ని ఇంటికి తీసుకెళ్లాక.. అసలు విషయం తెలిసి షాక్ అయ్యాడు..


ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన డేవిడ్ అనే వ్యక్తి రోజూ మాదిరే వాకింగ్ కోసం పార్క్‌కు వెళ్లాడు. వాకింగ్ చేస్తుండగా రోడ్డు పక్కన చెట్ల పొదల్లో పెద్ద రాయి కనిపించింది. మామూలు రాళ్లే కదా అనుకుని పట్టించుకోలేదు. కానీ ఆ రాయి కొంచెం ప్రత్యేకంగా ఉండడంతో అనుమానం వచ్చింది. సరే ఎలాగూ ఫ్రీగా వస్తోంది కదా.. కనీసం అలంకరణకు పనికొస్తుందిలే అనుకున్నాడు. 17 కేజీల బరువున్న ఆ రాయిని తీసుకుని ఇంటికి వెళ్లాడు. ఇంట్లో పార్కింగ్ స్థలంలో పడేసి అతను.. తర్వాత కొన్నాళ్లు దాన్ని పట్టించుకోలేదు.


అయితే ఇటీవల ఓ రోజు దాన్ని ముక్కలు చేసి, అలంకరణగా వినియోగించాలని అనుకున్నాడు. అయితే ఎంత కొట్టినా ఆ రాయి పగల్లేదు. శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అతడికి అనుమానం కలిగింది. అసలు ఇది ఏ రకం రాయి.. అనుకుని పరీక్షల నిమిత్తం తీసుకెళ్లాడు. అయితే రాయిని పరీక్షించిన జియాలజిస్టులు షాక్ అయ్యారు. అది సుమారు 460 కోట్ల సంవత్సాల క్రితం నాటిదని, అంతరిక్షం నుంచి భూమిపై పడిన ఉల్కగా గుర్తించారు. దాని విలువ బంగారం కంటే చాలా రెట్లు ఎక్కువ ఉంటుందని తేల్చారు. ఆ రాయి 2015లో దొరకగా.. ఇటీవలే దాన్ని పరీక్షలకు తీసుకెళ్లాడు. ఆ రాయి కారణంగా ఒక్కసారిగా అదృష్టం వరించడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Updated Date - 2021-11-28T02:50:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising