ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మానుష్య ప్రాంతంలో లిఫ్ట్ అడిగాడో వ్యక్తి.. ఇబ్బంది పడతాడేమోనని బైక్‌ను ఆపడమే అతడి పొరపాటయింది.. ఆ తర్వాత..

ABN, First Publish Date - 2021-12-23T18:37:28+05:30

అతను రాత్రి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు.. నిర్మానుష్య ప్రాంతంలో లిఫ్ట్ అడిగాడో వ్యక్తి.. రాత్రి సమయం, పైగా ఒంటరిగా ఉన్నాడని అతనికి లిఫ్ట్ ఇచ్చాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను రాత్రి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు.. నిర్మానుష్య ప్రాంతంలో లిఫ్ట్ అడిగాడో వ్యక్తి.. రాత్రి సమయం, పైగా ఒంటరిగా ఉన్నాడని అతనికి లిఫ్ట్ ఇచ్చాడు.. అదే అతను చేసిన పొరపాటైంది.. లిఫ్ట్ అడిగిన వ్యక్తి అతడి బైక్‌ను, అతడి దగ్గర ఉన్న రూ.1.50 లక్షలను దోచుకున్నాడు.. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.. పోలీసులు విజయవంతంగా ఆ కేసును ఛేదించారు.. బీహార్‌లోని లఖిసరాయ్ ‌లో ఈ ఘటన జరిగింది. 


ఈ నెల 2వ తేదీన రంజిత్ రాజ్‌ డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తుండగా మానిక్‌పూర్ కలై బ్రిడ్జి సమీపంలో మురారి కుమార్ అనే  వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. దీంతో రంజిత్ బైక్ ఆపాడు. వెంటనే మరో ముగ్గురు వ్యక్తులు వచ్చి రంజిత్‌ను బెదిరించారు. రంజిత్ బైక్‌ను, అతని వద్ద ఉన్న రూ.1.50 లక్షలను తీసుకుని వెళ్లిపోయారు. దీంతో రంజిత్ పోలీసులను ఆశ్రయించాడు. ఇటీవలి కాలంలో బైక్ చోరీ కేసులు ఎక్కువగా రావడంతో లఖిసరాయ్ పోలీసులు ఆ కేసుపై సీరియస్‌గా దృష్టి సారించారు. 


నిందితులు మురారి కుమార్, ప్రిన్స్ కుమార్‌లను అరెస్ట్ చేశారు. వారి ద్వారా సమాచారం తీసుకుని మరో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి తొమ్మిది బైక్‌లు, 6 మొబైల్‌లు, 15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ బైక్‌ల యజమానులను గుర్తించి వారికి అందిస్తామని పోలీసులు తెలిపారు. 


Updated Date - 2021-12-23T18:37:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising