ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15 ఏళ్ల బాలుడితో వెళ్లిపోయిన కూతురు.. 15వ రోజు తండ్రికి ఆమె ఫోన్ చేసి ఆధార్ కార్డును ఎందుకు అడిగిందో తెలిస్తే..

ABN, First Publish Date - 2021-08-03T21:25:44+05:30

వారిద్దరూ మైనర్లు.. ప్రేమలో పడి ఇంటి నుంచి పారిపోయారు.. దీంతో బాలిక తండ్రి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారిద్దరూ మైనర్లు.. ప్రేమలో పడి ఇంటి నుంచి పారిపోయారు.. దీంతో బాలిక తండ్రి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు.. అయినా పోలీసులు వారి ఆచూకీ కనిపెట్టలేకపోయారు.. చివరకు ఆ బాలికే స్వయంగా తన తండ్రికి ఫోన్ చేసింది.. ఇంటి దగ్గర మర్చిపోయిన తన ఆధార్ కార్డు పంపమని అడిగింది.. దీంతో పోలీసులు వారి ఆచూకీ తెలుసుకుని వారిని పట్టుకున్నారు.. ఇంతకీ ఆమె ఆధార్ కార్డు ఎందుకు అడిగిందో తెలుసా? హోటల్‌లో రూమ్ తీసుకోవడానికి.. 


ఉత్తరప్రదేశ్‌లోని చంబల్ ప్రాంతంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అరవింద్ కుమారుడు (16), తన క్లాస్ అమ్మాయితో 15 రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వారిద్దరూ చంబల్ నుంచి గోవా చేరుకున్నారు. అక్కడకు వెళ్లి ఏదైనా హోటల్‌లో రూమ్ తీసుకోవాలనుకున్నారు. అయితే వారిద్దరి వద్ద ఎలాంటి ఐడీ కార్డూ లేకపోవడంతో రూమ్ ఇచ్చేందుకు హోటల్ యాజమానులెవరూ ముందుకు రాలేదు. దీంతో వారు 14 రోజుల పాటు గోవాలోని ఫుట్‌పాత్‌లపైనే గడిపారు. చివరకు 15వ రోజున బాలిక నేరుగా తన తండ్రికి ఫోన్ చేసి ఆధార్ కార్డు కావాలని అడిగింది. 


అప్పటికే పోలీస్ స్టేషన్‌లో బాలుడి తండ్రిపై కిడ్నాప్ కేసు పెట్టిన బాలిక తండ్రి ఈ విషయం పోలీసులకు చెప్పాడు. దీంతో యూపీ పోలీసులు గోవా పోలీసులకు విషయం చెప్పారు. గోవా పోలీసులు వారిద్దరినీ కనిపెట్టి యూపీ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఆ ఇద్దరినీ చంబల్ తీసుకువచ్చారు. వారిద్దరినీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. కాగా, బాలిక తండ్రి పెట్టిన కిడ్నాప్ కేసు మేరకు బాలుడి తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక దొరకడంతో వారిద్దరినీ విడుదల చేశారు.

Updated Date - 2021-08-03T21:25:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising