7 ఏళ్ల వయసులోనే సిక్స్ ప్యాక్ బాడీ.. ఫిట్‌నెస్‌లో కుర్రాళ్లకే సవాళ్లు విసురుతున్న బాలిక..
ABN, First Publish Date - 2021-09-02T17:24:32+05:30
ఆ బాలిక వయసు పదేళ్లే.. కానీ, ఆమె పట్టుదల, అంకిత భావం చూస్తే ఎవరికైనా విస్మయం కలగక మానదు..
ఆ బాలిక వయసు పదేళ్లే.. కానీ, ఆమె పట్టుదల, అంకిత భావం చూస్తే ఎవరికైనా విస్మయం కలగక మానదు.. 7 ఏళ్ల వయసుకే సిక్స్ ప్యాక్ బాడీ సాధించి ఔరా అనిపించింది.. విరాట్ కోహ్లీ ఫౌండేషన్‌లో చోటు దక్కించుకుంది.. ఎంఎస్ ధోనీ వంటి సెలబ్రిటీలతో యాడ్స్‌లో కూడా నటించింది.. 2024 యూత్ ఒలింపిక్స్‌లో దేశానికి పతకం సాధించాలని కలలు కంటోంది.. ఆ బాలిక పేరు పూజ విష్ణోయ్.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన పూజ.. తన మామ, అథ్లెట్ శ్రావణ్ ప్రోత్సాహంతో ఐదేళ్లకే క్రికెట్ ఆడటం ప్రారంభించింది. ఫాస్ట్‌బౌలర్‌గా పూజ ప్రతిభ గురించి తెలుసుకున్న విరాట్ కోహ్లీ ఫౌండేషన్ ఆమెకు ప్రోత్సాహం అందించింది. పూజకు శిక్షణ ఇస్తోంది. కఠినమైన కసరత్తులు చేస్తూ, డైటింగ్ పాటిస్తూ పూజ ఏడేళ్లకే సిక్స్ ప్యాక్ బాడీ సాధించింది. రోజూ ఉదయాన్నే మూడు గంటలకు లేచి వ్యాయామం ప్రారంభిస్తుంది. అనంతరం ఆన్‌లైన్ క్లాసులకు హాజరువుతుంది. తర్వాత మళ్లీ వ్యాయామం చేస్తుంది.
2019 ఇండియన్ స్పోర్ట్స్ హానర్ 100 మీటర్ల పరుగు విభాగంలో పూజ స్వర్ణం సాధించింది. 2024లో జరగబోయే యూత్ ఒలింపిక్స్‌లో పాల్గొని స్వర్ణం సాధించాలని పూజ కలలు కంటోంది. పూజ ఇప్పటికే ధోనీ, పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి కమర్షియల్ యాడ్స్‌లో కూడా నటించింది.
Updated Date - 2021-09-02T17:24:32+05:30 IST