ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలంలో కనిపించినవి పిల్లి కూనలే అనుకుని పులి పిల్లలను ఇంటికి తెచ్చిన రైతు.. రోజూ పాలు పోసి, స్నానం చేయించేవాడు.. చివరకు..

ABN, First Publish Date - 2021-12-11T21:32:54+05:30

అతను ఓ రైతు.. రోజూ మాదిరే పొలం పనులకు వెళ్లాడు. పని ముగించుకుని ఇంటికి వచ్చే క్రమంలో అక్కడ ఉన్న రెండు పులి పిల్లలు.. రైతుకు మాత్రం పిల్లి కూనల్లా కనిపించాయి. ముద్దుగా ఉండడంతో ఇంటికి తీసుకెళ్లి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను ఓ రైతు.. రోజూ మాదిరే పొలం పనులకు వెళ్లాడు. పని ముగించుకుని ఇంటికి వచ్చే క్రమంలో అక్కడ ఉన్న రెండు పులి పిల్లలు.. రైతుకు మాత్రం పిల్లి కూనల్లా కనిపించాయి. ముద్దుగా ఉండడంతో ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలనుకున్నాడు. వెంటనే వాటిని తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. సొంత పిల్లలను చూసుకున్నట్లు.. రోజూ పాలు పట్టి, స్నానం కూడా చేయించేవాడు. ఓ రోజు అతడికి.. అవి పిల్లి పిల్లలు కాదు.. పులి పిల్లలు అని తెలిసింది. చివరకు ఏం జరిగిందంటే..


మధ్యప్రదేశ్ ధార్ పరిధి నిసార్‌పూర్‌కు సమీపంలోని బజ్రిఖేడా గ్రామంలో కిరణ్ గిరి అనే రైతు.. కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. రోజూ మాదిరే నాలుగు రోజుల క్రితం పొలంలో పనుంటే వెళ్లాడు. పనులన్నీ ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చే క్రమంలో అతడికి రెండు పులి పిల్లలు కనిపించాయి. అవి పిల్లి కూనలు అనుకుని దగ్గరికి తీసుకున్నాడు. ముద్దుగా ఉండడంతో పెంచుకోవాలని, ఇంటికి తీసుకెళ్లాడు. రోజూ పొద్దునే స్నానం చేయించడం, పాలు పట్టడం, మంచంపై దుప్పటి కప్పి పడుకోబెట్టడం చేస్తుండేవాడు. అంతవరకూ అవి పిల్లి పిల్లలే అనుకుంటూ ఉండేవాడు.

బుడ్డోడే కానీ.. భలే మంచి పని చేశాడు.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు..


వాటిని చూసిన ఇంటి పక్కల వారికి అనుమానం వచ్చింది. అవి పులి పిల్లలని గ్రహించి భయందోళనకు గురయ్యారు. ఓ రోజు రైతుకు విషయం తెలియజేశారు. అసలు విషయం తెలుసుకున్న రైతు, ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే నిసార్‌పూర్‌ ఫారెస్ట్ అవుట్‌పోస్టు సిబ్బందికి విషయం తెలియజేశాడు. అనంతరం వాటిని అక్కడకు తీసుకెళ్లి అధికారులకు అప్పగించాడు. వాటిని పరిశీలించిన ఏఎస్సై అశుతోష్ జోషి.. వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత ఉన్నతాధికారులకు సమాచారం అందించి, వాటిని జంతు సంరక్షణ శాలకు తరలించారు.

బీటెక్ పూర్తి కాకుండానే రూ.20 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్.. ఆర్మీలో చేరాలన్న మక్కువతో రిజెక్ట్ చేసి మరీ..

Updated Date - 2021-12-11T21:32:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising