ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఛీ..ఛీ.. ఎదురుగా తండ్రి శవం పెట్టుకుని ఇదేం పాడు పని.. ఓ యువతిని ఏకిపారేస్తున్న నెటిజన్లు..!

ABN, First Publish Date - 2021-10-27T22:13:51+05:30

ఏ పని చేయడానికైనా ఒక సమయం, సందర్భం అంటూ ఉంటుంది. కొందరు ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు చేస్తుంటారు. ఇలాగే అమెరికాకు చెందిన ఓ యువతి.. తన తండ్రి శవం ఎదుట చేసిన పిచ్చి చేష్టలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏ పని చేయడానికైనా ఒక సమయం, సందర్భం అంటూ ఉంటుంది. కొందరు ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు చేస్తూ.. చివరికి అందరి ముందూ నవ్వులపాలవుతుంటారు. ఇలాగే అమెరికాకు చెందిన ఓ యువతి.. తన తండ్రి మృతదేహం ఎదుట చేసిన పిచ్చి చేష్టలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. తండ్రి చనిపోయారన్న బాధ కూడా లేకుండా ఇలా చేయడమేంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


అమెరికాకు చెందిన యువతి తండ్రి చనిపోయాడు. దీనిపై ఆమె మొఖంలో బాధ కూడా కనిపించలేదు. అంతటితో ఆగకుండా తండ్రి శవపేటిక ఎదుట నిలబడి, వివిధ భంగిమల్లో ఫొటోలకు ఫోజులిచ్చింది. అనంతరం ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్, రెడ్డిట్‌లోని గ్రూప్‌లో షేర్ చేసింది. వైరల్ అయిన ఈ ఫొటోలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆమెకు హృదయం అంటూ లేదా అని కొందరు అంటుంటే.. పిచ్చిగానీ పట్టలేదుకదా అంటూ మరికొందరు కామెంట్లు చేశారు. అయితే ఆమె ఇలా ఎందుకు చేసిందనే దానిపై వివరణర ఇవ్వలేదు. మొత్తానికి ఈ ఫొటోలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ యువతి ఫొటోలను తొలగించినట్లు బ్రిటిష్ మీడియా పేర్కొంది. ఆ హ్యాష్‌ట్యాగ్‌తో వెతికినా ఎలాంటి ఫొటో కనిపించలేదని తెలిపింది.

Updated Date - 2021-10-27T22:13:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising